అంతరించిపోతున్న పక్షులలలో రాబందులు కూడా చేరాయి. ఇవి ప్రదానంగా చనిపోయిన, కుళ్లిపోయిన జంతువుల మాంసాన్ని తింటాయి. తద్వారా పర్వావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. వాతావరణ మార్పుల వలన మానవుల తప్పిదాల వలన ప్రస్తుతం రాబందులు దాదాపు అంతరించిపోయాయి. జంతుప్రదర్శన శాలలలో కూడా వీటిని చూడలేకపోవుచున్నాము.
ఇవి రెక్కలు విప్పినపుడు ఆరడుగుల పొడవు ఉంటుంది. భారతదేశంలో కనిపించే రాబందులు విశాలమైన రెక్కలతో షుమారు 7 కేజీల బరువు ఉంటాయి.వీటి తల చుట్టూ తెల్లటి ఈకలు, మెడదగ్గర మాత్రం పసుపు రంగు ఈకలు ఉంటాయి.
ప్రపంచం మొత్తం మీద 23 రకాల రాబందులు ఉన్నాయి. వీటికి సునిసితమైన వినికిడి, చూపు కలదు. వీటి బలహీనమైన పాదాలు కాళ్లవలన తమ ఆహారాన్ని మోసుకుపోలేవు.