వీటిలో 250 రకాల జాతులున్నాయి. ఇవి చెట్ల బెరడులలోని పురుగులను, పడిపోయిన చెట్ల కాండాలను తమ బలమైన ముక్కుతో ఛేదించి కీటకాలను తింటాయి.
ఇవి ఆసియా దేశాలలో, దక్షిణ అమెరికా దేశాలలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి జీవితాంతం చెట్లదగ్గరే జీవిస్తాయి. ఆహారం కోసం చెట్ల చూట్టూ తిరుగుతుంటాయి.
ఇవి ఆరు నుండి తొమ్మది అంగుళాల వరకు పెరుగుతాయి. కొన్ని వడ్రంగి పిట్టలు చెట్లను తొలిచి రంధ్రం చేసుకుని అందులో నివసిస్తాయి. కొన్ని సార్లు కాండం మీద రంధ్రాన్ని రెండవ పక్కకు కూడా తొలుస్తాయి. వీటి శత్రవులు దాడి చేసినపుడు రెండవపక్కనుండి తప్పించుకుంటాయి. చెట్లను తొలిచేటపుడు తన బలమైన కాలిపంజాలతో చెట్లను గట్టిగా పట్టుకుంటాయి.
వడ్రంగి పిట్టలు కొన్ని నల్లగా, కొన్ని తెల్లగా ఉంటాయి.మడ వడ్రంగి పిట్ట తలమీద పింఛం (ఈకలు) ఉంటాయి. భారతదేశంలో 7,8 రకాల జాతులున్నాయి.