పాములు సరీసృపాల జాతికి చెందినవి. పాములలో అనేక వేల రకాలు ఉన్నాయి. అన్నిపాములు విషపూరితాలు కావు. భాతదేశంలో 300 రకాల పాముల జాతులు ఉన్నాయి. పాములు నేల బొరియలో, చెట్లపైన, నీళ్లలో, పుట్టలలో నివసిస్తాయి.
పాములు కరచినపుడు భయపడకూడదు, పరిగెత్తకూడదు. పాముల మీదకు రాళ్లుకానీ, కర్రలు కానీ విసరకూడాదు. కదలకుండా శబ్దం చేయకుండా నిలబడితే పాములు వాటి దారిన అవే పోతాయి.
సాములు కరచిన తరువాత దాదాపు మూడుగంటల సమయం ఉంటుంది. ఈ లోపుల మనం సమీపంలోని హాస్పటల్ కు వెళ్లినట్లైతే ప్రాణగండం తప్పుతుంది. సాధారణంగా విషం రెండురకాలుగా ఉంటుంది. పాముల విషాన్ని ’’వెనమ్‘‘ అంటారు. ఇది రక్తంలో కలిసినపుడు మాత్రమే మరణం సంభవిస్తుంది. పాము విషాన్ని నేరుగా నోటితో తీసుకుంటే అది అరిగిపోతుంది. (ప్రేగులలో కానీ పొట్టలోకానీ గాయాలు లేనపుడు మాత్రమే). రక్తపింజర, చిన్నపింజర, నాగుపాము, కట్లపాములు, ఇసుకపింజరి పాములు మాత్రమే విషపూరితమైనవి. పాములు కరచినపుడు భయపడకూడదు. ధైర్యంగా ఉండాలి. భయంపడితే విషం వలన కాకుండా భయంవలనే ముందుగా మరణం సంభవిస్తుంది.
నిజానికి పాములకు చెవులుండవు. పొట్టభాగంలో ఉండే సునిశితమైన నాడులవలన భూమిపైన వచ్చే శబ్దాలను గ్రహిస్తుంది.నాగుపాములను ఆడించే వారి కదలికలను బట్టి పాములు నాట్యం చేస్తాయి. పాములు పాలుతాగుతాయని నమ్మకం కూడా ఉంది. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పొస్తుంటారు. కానీ పాములు పాలు తాగవు. ఒకవేళ పాలుతాగితే 3,4 గంటల తరువాత పాలను కక్కివేస్తాయి కానీ పాముకూడా చనిపోతుంది. కనుక పాముల పుట్టలో పాలు పోయటం మంచిది కాదు.
ఈ పాములు అత్యంత విషపూరితమైనవి. విషపు పాములలో నాగుపాములు మొదటివిగా చెబుతారు కానీ, రక్తపింజరులు నాగుపాముకంటే విషపూరితమైనవి. రక్తం మొత్తం ప్రభావితమై మరణం సంభవిస్తుంది.
ఏ విధంగా గుర్తుపట్టాలి...?
ఈ పాముల తల త్రికోణాకారంలో ఉంటుంది. దీని తలనుండి తోక వరకు గుండ్రని గుర్తులు (మచ్చలు) ఉంటాయి. పొట్టభాగం (అడుగుభాగం) తెల్లగా ఉంటుంది.ఇది అత్యంత వేగవంతమైన పాము. ఒక సెకనులో నాలుగవ వంతు సమయంలో కాటువేస్తుంది. ఈ పాము కరచిన వెంటనే ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లాలి. ఈ పాము కరచిన రెండు నుండి మూడు గంటల తరువాత శరీరంలోని కండరాలు, నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ముక్కు, నోరు, చెవులు, ఇతర గాయాల నుండి రక్తం వస్తుంది.
మూడు అడుగుల పొడవు పెరిగే ఈ ఇసుకపింజరి పాములు అత్యంత విషపూరితమైనవి. అత్యంత ఆవేశపూరితమైనవి కూడా. మనుషులు, ఇతర జంతువుల కనబడినపుడు నేరుగా కాటువేయవు. ముందుగా బుసలు కొడుతూ హెచ్చరిస్తాయి. వాటిమీదకు దాడిచేస్తే కరుస్తాయి.
వీటితల పొట్టిగా వెడల్పుగా బాణం ఆకారంలో ఉంటుంది. కళ్లు పెద్దవిగా ముందుకు పొడుచుకు వచ్చి ఉంటాయి.
అత్యంత విషపూరిత పాములలో కట్లపాము కూడా ఒకటి. ఇవి అడవులలో, పొదలలో, పోలాలలో ఎక్కువగా నివసిస్తాయి. భారతదేశంలో ఈ పాముకాట్ల వలన మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఇవి నీలం రంగు, బూడిదరంగు, నలుపు రంగులో ఉండి శరీరం మొత్తం నలుపురంగులో పట్టీలు (రబ్బర్ బ్యాండ్లలాగా) ఉంటాయి.
దీని విషయం నాగుపాము కంటే 16 రెట్లు ఎక్కువగా విషపూరితమైనది. ఇవి కరచినపుడు నాడీవ్యవస్థ, కండరాలు, శ్వాసవ్యవస్ధ దెబ్బతింటాయి.
ఇవి నీళ్ల ఉన్న ప్రాంతాలలో, పొదలలో, పాడుపడిన ఇళ్లలో, పొలాలలో, ఇటుకలలో, ఖాళీ ప్రదేశాలలో నివసిస్తుంటాయి. వీటికి పందికొక్కులంటే చాలా ఇష్టం. పందికొక్కుల బొరియ (నేలను తొలచి చేసిన రంధ్రం) లలో కూడా కనబడుతుంటాయి.
భారతదేశానికి చెందిన నాగుపాములు విషపూరితమైనవి. వీటి కాటువలన మనుషులు, జంతువులు మరణిస్తారు. నాగుపాములు దాదాపు ఆరు అడుగుల పొడవుదాకా పెరుగుతాయి. వీటి పడగ వెనుక భాగంలో కళ్లజోడు ఆకారంలో గుర్తు ఉంటుంది. దీనిని బట్టి నాగుపాములను గుర్తించవచ్చు.
ఆడ నాగుపాములు12 నుండి 30 గుడ్లవరకు నెల బొరియలలో గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పొదగబడి 48 ను 69 రోజులలో పిల్లలు బయలటకు వస్తాయి. పిల్ల నాగుపాములు కూడా విషపూరితమైనవి.
మనకు నాగుపాములు కనపడినపుడు అవి మనలను నేరుగా కరవవు పడగవిప్పి, బుసలు కొడుతూ భయపెదతాయి. ఇవి కరచినపుడు కరచిన భాగం నల్లగా మారుతుంది. మత్తుగా ఉంటుంది. వాంతులు కావచ్చు. ఈ లక్షణాలు కనబడితే నాగుపాము కరచిందని గుర్తించి వెంటనే వైద్యసహాయం పొందాలి.
చాలామంది జర్రిపోతులను మగ నాగుపాముగా పొరపడుతుంటారు. కానీ జెర్రిపోతులు వేరు, నాగుపాములు వేరు. ఇటిని ఇలా గుర్తుపట్టవచ్చు. ఈ పాముల సగం శరీరం వరకు ఏ గుర్తులు లేకుండా సాదాగా ఉంటుంది. హిగతా శరీరం తోక నుండి మధ్యభాగం వరకు నల్లటి చారలు ఉంటాయి. దీనిని ఈ విధంగా గుర్తించవచ్చు.
ఇవి చెట్లమీద నివసిస్తాయి. సన్నగా పొడవుగా ఆకుపచ్చరంగులో ఉంటాయి. వీటి తల చెట్ల ఆకు రంగులో పచ్చగా ఉంటుంది. ఇవి విషపూరితాలు కావు కానీ కొద్దిమొతాదులో విషయం ఉంటుంది. వీటి గురించి జనంలో ఒక మూఢనమ్మకం ఉంది. ఇవి మనుషుల కళ్లుపీకి తింటుందని అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదంటారు నిపుణులు. ఈ పాములు చిన్న, చిన్న కీటకాలను, బల్లులను, కప్పలను, పక్షిగుడ్లను, పక్షులను ఆహారంగా తింటుంది.
ఇవి సాధారణంగా భూమిలోపల, రాతి ఇసుక నేలలో నివసిస్తాయి. నిజానికి ఈ పాములకు రెండుతలలు ఉండవు. తొక సన్నగా కాకుండా బండగా తలలాగా ఉంటుంది. శత్రవులు దాడిచేసినపుడు ఇది చుట్టుకుపోయి తొకను బయటపెడుతుంది. దీనిశత్రువులు ఇదే దీని తలగా పొరపడుతుంటాయి. ఇవి తుత గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు, లేక పసుపు కలిసిన గోధుమ రంగులో ఉంటాయి. తొమ్మది అడుగుల పొడవు దాకా పెరుగుతాయి.
ఈ పాము కూడా భూమిలోపలే నివసిస్తుంది. దీని శరీరం మీద పలకలుగా కానీ క్రమపద్దతిలో లేని మచ్చలు దూరం దూరంగా ఉంటాయి. దీని గురించి కూడాజనంలో ఒక అపోహ ఉంది. ఇది కరవదని కానీ నోటితో నాకినపుడు దీని మీద ఉన్న మచ్చలు మనుషుల శరీరం మీదకు వస్తాయని అపోహ పడుతుంటారు. ఇది నిజం కాదంటారు పాముల గురించి అధ్యయనం చేసిన నిపుణులు.
పాములలో అతి పెద్దవి కొండ చిలువలు. ఇవి ఎక్కువగా అడవులలోనూ, కొండ ప్రాంతాలలోనూ నివసిస్తాయి. ఇవి 30 అడుగుల పొడవుదాకా పెరుగుతాయి. ఎలుకలు, పక్షులు, గుడ్లను తింటాయి. పెద్ద కొండచిలువలు చిన్న చిన్న జంతువులను అనగా మేకలు, గొర్రెలు, కోళ్లు, కోతులను కూడా సునాయాసంగా మింగుతాయి. మనుషుల మీద అరుదుగా దాడి చేస్తాయి.
ఇవి జంతువులను నేరుగా మింగవు. తమ బలమైన శరీరంతో చుట్టి, ఎముకలు విరిగేలా బిగించి ఆ ప్రాణి చనిపోయిన తరువాత నెమ్మదిగా మింగుతాయి. ఇవి చాలా నెమ్మదిగా కదులుతాయి. కానీ తమ దగ్గరకు వచ్చిన జంతువులను తల అత్యంత వేగంగా కదలించి పట్టుకుంటాయి. కనుక కొండచిలువలు కనబడినపుడు దగ్గరకు పోకుండా దూరంగా ఉండటం మంచిది.
ఇవి సాధారణంగా 25 సంవత్సరాలు జీవిస్తాయి. వాతావరణం అనుకూలిస్తే ఇంకా ఎక్కువకాలం జీవించవచ్చు.