ఎలుగుబంట్లు ఆసియా, యూరోప్, అమెరికా ఖండాలలో ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఎలుగుబంట్లు అన్ని రకాల ఆహారపదార్థాలు అనగా శాఖాహారం, మాంసాహారం అన్నిటిని తింటాయి.
భారతదేశంలో సామాన్యంగా నల్లరంగు ఎలుగుబంట్లు ఎక్కువగా కనబడతాయి. మంచు పర్వతాలలో మరియు అంటార్కిటకాలో తెల్ల ఎలుగుబంట్లు కనబడతాయి. ఇవి షుమారు 300 కిలోల బరువు, 3 నుండి నాలుగు అడుగుల పొడవు ఉంటాయి. ఆడ ఎలుగుబంట్లకంటే మగవి పెద్దవిగా ఉంటాయి. ఇవి నీటిలో చక్కగా ఈదగలవు. చెట్లును ఎక్కగలవు.
వీటి ఆహారం చెట్ల చిగుర్లు, చీమలు, కీటకాలు, భూమిలో దొరకే దుంపలు. ఇవి తేనెను ఎక్కువగా ఇష్టపడతాయి. చెట్లు ఎక్కి తేనెపట్టునుండి తేనెను తాగుతాయి. వీటి శరీరంమీద దట్టంగా వెంట్రుకలు ఉండటం వలన తెనెటీగలు వీటిని కుట్టినా వీటికి ప్రమాదం ఉండదు. సాధారణంగా ఇవి తినని పదార్థం ఉండదు.
ఇవి చలికాలం మొత్తం నిద్రపోతాయి. చెట్ల తొర్రలలోనూ, కొండ సందులలోనూ, నేల బొరియలలూ చలికాలం చక్కగా నిద్రిస్తాయి. వీటి శరీరంలోని కొవ్వు ఈ సమయంలో ఆహారంగా ఉపయోగాపడి వీటికి శక్తినిస్తుంది.
ఆడ ఎలుగులు 60 నుండి 70 రోజులపాటు గర్భం ధరించి ఒకటి నుండి 4 పిల్లల వరకు కంటుంది. వీటి పిల్లలు పుట్టినపుడు కళ్లకనబడవు, పళ్లు ఉండవు, 16 నెలలపాటు తల్లి వీటిని కాపాడుతుంది. తరువాత మెల్ల మెల్లగా వీటికి చూపువచ్చి స్వంతంగా ఆహారాన్ని సేకరించుకుంటాయి. వీటి జీవితకాలం 25 సంవత్సరాలు.