కృష్ణ జింకలు సాధారణంగా గుంపులుగా నివసిస్తాయి. ఒక్కో గుంపులో 20దాకా ఉంటాయి. ప్రతి గుంపులో ఒక బలమైన మగజింక ఉంటుంది. కృష్ణ జింకలు భారతదేశంలోనే ఎక్కువగా ఉంటాయి. నేపాల్ పాకిస్తాన్ లో కూడా కొద్ది సంఖ్యలో ఉన్నాయి. భారతీయులు వీటిని పవిత్రమైన వాటిగా భావిస్తారు.
ఇవి గడ్డి ఎక్కువగా ఉన్న విశాలమైన పచ్చిక భూములలో నివసిస్తాయి. ఇవి చాలా వేగంగా పరిగెత్తగలవు. ఇవి మూడు అడుగుల పొడవు ఉంటాయి. బరువు 40 కిలోల దాకా ఉండవచ్చు. మగ కృష్ణజింకలు ముదురు గోధుమరంగులో ఉంటాయి. వీటికి 28 అంగుళాల పొడవైన మెలితిరిగిన కొమ్ములుంటాయి. ఆడ కృష్ణ జింకలకు కొమ్ములుండవు. లేత గోధుమరంగులో ఉంటాయి.
కృష్ణజింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజంతువు. ఇవి రక్షిత జంతువులు. వీటిని వేటాడటం నిషేధం. వీటికి ప్రధాన శత్రువులు మనుషులే. వీటిని మాంసం కొరకు, చర్మం కొరకు చంపుతుంటారు. వీటి జీవితకాలం 10 నుండి 15 సంవత్సరాలు.
నేటికి సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ప్రఖ్యాత హిందీ సినిమాల నటుడు తన సహచర నటులు టబూ, సైఫ్ ఆలీఖాన్, సోనాలి భింధ్రే, నీలమ్ లతో కలసి రాజస్తాన్, జోధ్ పూర్ లో రెండు కృష్ణ జింకలను చంపినందుకు మూడు సంవత్సరాల జైలు శిక్షను అనుభవించాడు. నేటికీ ఈ కేసు తేలలేదు. ఇతను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.