మొసళ్లు సరీసృపాల జాతికి చెందినవి. ఉప్పునీటి మొసళ్లు, మంచినీటి మొసళ్లు వేరు, వేరుగా ఉంటాయి. ఇవి చాలా క్రూర స్వభావం కలవి. ఇవి నివసించే నీటిలో దిగిన ఎనుగునైనా తమ బలమైన దవడలతో పడగొడతాయి. జింకలను, చిన్న చిన్న జంతువులను, దూడలను అమాంతం మింగివేయగల సామర్ధ్యం కలవి. ఇవి ఇంకా కప్పలను, చేపలను, పక్షులను, నీటిలో తిరిగే ఇతర జంతువులను తింటాయి.
ఆడ మొసళ్లు ఒకేసారి 10 నుండి 60 గుడ్లను పెడుతుంది. ఇవి 110 రోజుల పాటు పొదగబడి తరువాత గుడ్లనుండి పిల్లలు వస్తాయి. ఇవి 15 సంవత్సరాలకు పెద్దవిగా పెరుగుతాయి. వీటి జాతిని బట్టి ఇవి 30 సంవత్సరాల దాకా జీవిస్తాయి. అరుదుగా కొన్ని జాతి మొసళ్లు మాత్రం75 సంవత్సరాల దాకా బతుకుతాయి.