భూమి మీద నివసించే పెద్ద జంతువు ఏనుగు. పొడవైన తొండంతో, స్థంభంలాంటి గుండ్రని కాళ్లతో, తొండానికి ఇరు వైపులా తెల్లని దంతాలచే, పెద్ద, పెద్ద చెవులతో ఏనుగు ఉంటుంది.
ఇవి ఎక్కుగా గడ్డి నేలలలో, అడవులలో నివసిస్తాయి. ప్రపంచంలో ఆఫ్రికా ఏనుగులు పెద్దవిగా ఉంటాయి. ఆసియా దేశాలలో ఉండే ఏనుగులు 15 అడుగుల ఎత్తుతో, షుమారు 5,500 కిలోల బరువుతో ఉంటాయి. ఇవి తొండంతో ఒకేసారి 10 లీటర్ల నీటిని పీల్చుకుని తిరిగి నోటిలో పోసుకుంటాయి. తొండంతోనే ఆహారాన్ని తీసుకున నోటిలో పెట్టుకుని తింటాయి.
ఆడ ఏనుగులు గర్భధారణ సమయం 18 నుండి 22 నెలలు. ఏనుగు పిల్ల పుట్టినపుడు 100 కిలోల బరువు ఉంటుంది. 3 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆడ ఏనుగులు పిల్ల ఏనుగుకు చాలా కాలంపాటు పాలిచ్చి పెంచుతాయి.
ఏనుగుల సాధారణంగా నీరు, ఆహారం పుష్కలంగా ఉన్నచోటికి ప్రయాణిస్తుంటాయి. ఏనుగుల ఆహారం చెట్ల ఆకులు, చెరకు గడలు, అరటికాయలు, పండ్లు,. ఒక పెద్ద ఏనుగు ఒక రోజుకు 100 కిలోల ఆహారం, 100 లీటర్ల నీరు తీసుకుంటుంది.
ఆరోగ్యంగా ఉన్న అడవి ఏనుగు షుమారు 70 సంవత్సరాల పాటు జీవిస్తుంది.
పూర్వకాలం నుండి ఏనుగులను, మనుషులు మచ్చిక చేసుకొనే వారు. పూర్వకాలం ఏనుగులు యుద్దాలలో ప్రముఖ పాత్ర వహించేవి. వీటిమీద ఎక్కి యుద్ధాలు చేసేవారు. ఆధునిక కాలంలో కూడా ఏనుగులను గుళ్లలో చూడవచ్చు. ఏనుగులను రక్షిత జంతువులుగా అనేక దేశాలు ప్రకటించాయి. ఏనుగలను వేటాడం నిషేధించారు. ఏనుగు దంతాలు చాలా విలువైనవి. ఈ దంతాలతో దువ్వెనలు, బొమ్మలు తయారు చేస్తారు.