నక్కలు కుక్కలజాతికి చెందినవి. వీటి తోక పొడవైన వెంట్రుకలతో కుచ్చులాగా ఉంటుంది. మూతి సన్నగా, చెవులు నిక్కపొడుచుకుని ఉంటాయి. ఇవి మూడున్నర అడుగుల పొడవు, 18 అంగుళాలల ఎత్తు, 7 కేజీల బరువు ఉంటాయి.
ఎలుకలు, పక్షులు, చుంచు ఎలుకలు, కుందేళ్లు, పండ్లు, పక్షుల గుడ్లు వీటి ఆహారం. సింహాలు వేటాడి తిని వదలి వేసిన ఆహారాన్ని కూడా తింటాయి. ఇవి చేపలను, కప్పలను కూడా తింటాయి.
ఆడ నక్కలు 8 వారాల గర్భధారణ తరువాత పిల్లలకు జన్మ నిస్తాయి. సాధారణండా 5 పిల్లలకుజన్మ నిస్తాయి. కొన్ని నక్కలు 10 పిల్లల దాకా జన్మనిస్తాయి. 5 వారాల పాటు వీటిని తల్లి, తండ్రి నక్కలే సంరక్షిస్తాయి. వీటి జీవితకాలం రెండు నుండి నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఇవి కొండల సందులలోనూ, నేలను తొలచి బొరియలు చేసుకుని అందులోనూ నివసిస్తాయి.
ఇవి సాధారణంగా అడవులు, గడ్డి భూములు, పర్వతాలలో, ఎడారులలో నివసిస్తాయి.