ఇవి క్షీరదాలు అనగా తల్లిదగ్గ పాలు తాగి పెరిగే జీవులు. వీటి స్వభావం భయంకరంగా, ఉద్రేకపూరితంగా ఉంటుంది. ఇవి రెండున్నర అడుగుల పొడవు, 14 కిలోల బరువు ఉంటాయి.
వీటికి బలమైన పళ్లు, పంజాలు ఉంటాయి. బలమైన పంజాతో తాబేలు పైన డిప్పను సహితం పగలగొట్టగలదు. ఇవి కీటకాలను, దుంపలను, పక్షులను, పండ్లను, ఎలుకలను తింటుంది. వీటికి తేనెకంటే తేనెటీగల లార్వా ఎక్కువ ఇష్టం. వీటికోసం తేనెపట్టులో పంజాపెట్టి తేనెతో సహా లార్వాను తింటుంది. కొన్ని వందల తేనెటీగల కాట్లను సహిస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతుంది. ఇవి విషపూరిత పాములనుసహితం తింటాయి.
సింహాలు, చిరుతపులులు, హైనాలు వీటిని వేటాడి చంపి తింటాయి.
ఇవి తమ బలమైన పంజాతో గట్టి నేలను కూడా 10 నిమిషిలలో తవ్వి బొరియలు ఏర్పరుచుకుంటాయి. పగలంతా విశ్రాంతి తీసుకుని రాత్రి సమయంలో వేటాడుతాయి.
ఆడ హానీ బాడ్జర్ 10 వారాలపాటు గర్భం ధరించి ఒకే ఒక పిల్లకు జన్మనిస్తుంది. ఇవి పెరగటానికి 6 నెల సమయం పడుతుంది. కానీ రెండు సంవత్సరాలపాటు తల్లి సంరక్షణలో ఉంటాయి. ఈ సమయంలో తల్లి వీటికి భూమిని తవ్వటం, చెట్లను ఎక్కటం, వేటాడటం నేర్పుతుంది. వీటి జివితకాలం షుమారు 24 సంవత్సరాలు.