హైనాలు ఆసియా, ఆఫ్రికా దేశాలలో మాత్రమే కనబడతాయి. ఇవి సింహాలు, పులులు ఇతర జంతువులు వేటాడి వదలివేసిన మాంసాన్ని తింటాయి. వీటికి కంటి చూపు ఎక్కువ, వినికిడి కూడా ఎక్కువ, దూరంలో ఉన్న మాంసాన్ని కూడా వాసనతో పసిగట్టగలవు. వీటిలో చారలవి, బ్రౌన్ కలర్ వి, మచ్చలు హైనాలు ఉన్నాయి. భారతదేశంలో చారల హైనాలు మాత్రమే కనిపిస్తాయి. వీటి ఆకారం కుక్కలను పోలి ఉంటుంది.
ఇవి నాలుగు అడుగుల పొడవుగా ఉంటాయి. 40 నుండి 80 కిలోల దాకా బరువు ఉంటాయి.
ఇవి అప్పుడప్పుడూ మనుషులమీద దాడి చేస్తాయి. కోళ్లు, చిన్న పశువులను దొంగతనం చేసి చంపితింటాయి. ఇవి గుంపులు, గుంపులుగా కలసి వేటాడుతాయి. చచ్చిపోయిన జంతువుల కళేబరాలను కూడా తింటాయి. ఇవి చెద పురుగులను ఇష్టంగా తింటాయి. పక్షులను, చేపలను, బల్లులు, పాములను, నక్కలను, ముళ్లపందులను కూడా వేటాడి తింటాయి.
ఆడ హైనాలు మూడు నెలల గర్భధారణ తరువాత రెండు నుండి నాలుగు పిల్లలను కంటుంది. 15 నెలలపాటు తల్లి హైనాలు వీటిని పాలిచ్చి సాకుతాయి. వీటి జీవితకాలం 10 నుండి 21 సంవత్సరాలు.