చిరుతపులులు కూడా పిల్లిజాతికి చెందినవవే. పులికి సింహానికి బంధువులలాగా ఉంటాయి. ఇవి భారతదేశం, చైనాలతో పాటు కొన్ని ఆసియా దేశాలలో కూడా ఉన్నాయి. ఇవి మూడడుగుల ఎత్తుతో 90 కిలోల బరువుతో ఉంటాయి. అత్యంత వేగంగా పరిగెత్తగలవు.
ఇవి జింకలను అడవి పందులను ఎక్కువగా వేటాడి తింటాయి. ఇవి నీటిలో ఈదగలవు చేపలను ఎండ్రకాయలను కూడా తింటాయి.
ఇవి నీటిలో చక్కగా ఈదుతాయి. ఆడ చిరుతలు మూడు నెలల గర్భధారణ తరువాత 2 నెండి నాలుగు పిల్లల దాకా పెడతాయి. వీటిలో నల్లరంగులో ఉండే నల్ల చిరుతలు కూడా ఉంటాయి. ఇవి చెట్లు ఎక్కగలవు. వీటి జీవితకాలం 12 నుండి 17 సంవత్సరాలు.