సింహాన్ని అడవికిరాజు అంటారు. అడవి జంతువులలో చాలా బలమైనది సింహం. పెద్ద తలతో, 6 నుండి 7 అడుగుల పొడవుతో, పొట్టి కాళ్లతో, మూడు అడుగుల ఎత్తుతో ఉంటుంది. మగ సింహం బరువు170 నుండి 230 కేజీలు ఉంటుంది. ఆడసింహం కొద్దిగా చిన్నగా 180 కేజీల బరువు ఉంటుంది. ఇవి పిల్లిజాతికి చెందినవి.
మగ సింహానికి తల చుట్టూ జూలు (వెంట్రుకలు) ఉంటుంది.ఆడ సింహానికి జూలు ఉండదు. సింహాలు క్రూర జంతువులు. ఇవి ఇతర జంతువులను లేళ్లు, జీబ్రాలు, అడవి దున్నలు, కుందేళ్లు, జింకలు,అడవి పందులు మొదలగు జంతువుల వేటాడి తింటాయి. అరుదుగా జిరాఫీలను ఏనుగులను వేడాడుతాయి.
సింహాలు ఎక్కువగా ఆఫ్రికా, యూరోప్, ఆసియా దేశాలలో ఉంటాయి. ఇవి సాధారణంగా చిన్న చిన్న గుంపులుగా నివసిస్తాయి. గుంపుగానేవేటాడి ఆహారాన్ని కలసి తింటాయి. ఇవి నివసించే ప్రాంతం చుట్టూరా కొంత ప్రదేశాన్ని ఆక్రమించుకొని వేరే సింహాలను ఈ ప్రాంతంలోనికి రానివ్వవు.
ఒక్కో సింహం సుమారు 34 కిలోల మాంసాన్ని ఒకేసారి తింటుంటుంది. సింహం రోజు మొత్తంలో 21 నుండి 22 గంటలసేపు విశ్రాంతి తీసుకుంటుంది. షుమారు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటుంది. తరువాత వేటాడుతుంది.ఇవి సాధారణంగా గడ్డి మైదానాలలో నివసిస్తాయి.
సాధారణంగా వీటి జీవిత కాలం 10 నుండి 14 సంవత్సరాలు మాత్రమే.
ఆడ సింహాలు సంవత్సరానికి ఒకసారి ఒకటి నుండి ఆరు పిల్లలను పెడుతుంది. వీటి గర్భధారణ 108 రోజులు. సింహం పిల్లలకు పుట్టినపుడు కళ్లు కనబడవు. ఇవి రెండుసంవత్సరాల వయసు దాటిన తరువాత మాత్రమే స్వంతంగా వేటాడగలవు. అప్పటిదాకా తల్లి సింహం వీటిని కాపాడుతుంది.