ఇవి పొడవైన కుచ్చుతోకతో పొట్టి కాళ్లతో, చిన్న చెవులు, సూది ముక్కుతో ఉంటాయి, వీటి కదలికలు చాలా చురుకుగా, అత్యంత వేగంగా ఉంటాయి. నాగుపాములతో సహా అన్ని రకాల విషపు పాములను ధైర్యంగా ఎదుర్కొని పోరాడి చంపగలదు. వీటి శరీరం 10 అంగుళాల పొడవు, తోక 8 అంగుళాల పొడవు ఉంటుంది.
ఇవి మాంసాహరులు మరియు శాఖాహారులు కూడా. చిన్న చిన్న కీటకాలను, పక్షులను, గుడ్లను తింటాయి. పండ్లను, బెర్రీస్ ను, దుంపలను, విత్తనాలను కూడా తింటాయి.ఆడ ముంగీలపు 42 నుండి 105 రోజులపాటు గర్భం ధరించి ఒకటి నుండి 4 పిల్లలు దాకా పెడతాయి. పిల్లలు ఎదగటానికి రెండు సంవత్సరాలు పడుతుంది. వీటి జీవితకాలం అడవులలో స్వేచ్ఛగా సంచరించినపుడు 6 నుండి 10 సంవత్సరాలు.