ఉడుములు బల్లి జాతికి చెందినవి. కానీ ఇవి బలమైన శరీరంతో బల్లుల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. వీటికి బలమైన పంజాలు ఉంటాయి. వీటి పంజాలతో గొడలను గట్టిగా పట్టుకోగలవని చెబుతారు.
వీటి ఆహారం చిన్న చిన్న కీటకాలు, చేపలు, పక్షులు, గుడ్లు, చిన్న చిన్న జంతువులు. కొన్ని ఆటవిక జాతుల వారు వీటిని వేటాడి వీటి మాంసాన్ని తింటారు. వీటి చర్మాన్ని కూడా తీసి అమ్ముతారు.
ఇవి స్వతహాగా పిరికివి. ఇవి కనపడినపుడు వీటి దగ్గరకు పోకుండా దూరంగా ఉంటే వాటి దారిన అవిపోతాయి.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సింహగడ్ కోటను జయించటానికి తన సేనాపతి తానాజీని పంపుతాడు. అప్పుడు వారు ఎత్తైన సింహగఢ్ కోట గోడను ఎక్కటానికి వారి పెంపుడు ఉడుమును ఉపయోగించారు. ఉడుము నడుముకు తాడు కట్టి దానిని గోడపైకి పంపి తాడు సహాయంతో సైనికులు కోటుగోడపైకి వెళ్లారని చారిత్రక కథనం.