కోతులు చాలా తెలివైన జంతువులు. అవయవ నిర్మాణంలో, తెలివితేటలలో మానవులకు దగ్గరగా ఉంటాయి. ఇవి ప్రపంచమంతటా ఉన్నాయి. కోతులలో కొన్ని వందల రకాలు ఉన్నాయి. దేశాలబట్టి, ప్రాంతాలను బట్టి వీటి ఆకారాలు మారుతుంటాయి. చాలా మంది కోతులు కేవలం అరటిపళ్లు, శాఖాహారం తింటాయి అనుకుంటారు. కానీ కోతులు సర్వభక్షిణులు అంటే అన్ని రకాల ఆహార పదార్థాలను తింటాయి. వృక్షసంభంధమైన ఆహారాన్ని, మాంసాహారాన్ని కూడా తింటాయి.
కానీ కోతులు ఎక్కువగా పండ్లను, గింజలను, విత్తనాలను, పువ్వులను తింటాయి. కొన్ని కోతులు మాత్రం బల్లులను, తొండలను, పక్షులను, పక్షిగుడ్లను, సాలెపురుగులను కూడా తింటాయి.
ఇవి సాధారణంగా అడవులలోని చెట్లమీద, కొండలలోనూ నివసిస్తాయి. పల్లెలలో చెట్లమీద కూడా వీటి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.ఇవి సాధారణంగా గుంపులుగా నివసిస్తాయి. గుంపుని బలమైన, పెద్దదైన కోతి గుంపుకు నాయకత్వం వహిస్తుంది. వీటి శరీరం సన్నగా కాళ్లు పొడవుగా ఉంటాయి. ఇవి చెట్ల కొమ్మల మీద నుండి, ఒక చెట్టు మీద నుండి వేరొక చెట్టు మీదక నేర్పుగా గెంతగలవు.
వీటి గర్భధారణ సమయం వీటి ప్రాంతాన్నిబట్టి ఉంటుంది. పిల్ల కోతిని తల్లికోతి సాకుతుంది. పిల్లకోతి తల్లి పొట్టను కరుచుకుని ఉంటుంది.
భారతదేశంలో కోతులను చాలా పవిత్రంగా చూస్తారు. పురాణాలలో కూడా వీటి ప్రస్తావన ఉంది. వీటి జీవితకాలం 25 సంవత్సరాలు.