అలుగులు చాలా పిరికి జీవులు. అలుగులు చీమలను, చెదలను తినే జంతువు. ఇవి చెట్ల తొర్రలలోనూ, లేక భూమిలో బొరియలు చేసేకుని జీవిస్తాయి. వీటి శరీరం అంతా పోలుసులతో కప్పబడి ఉంటుంది. వీటికి సన్నని మూతి, పొడవైన నాలుక ఉంటుంది.
పొడవైన నాలుకతో చీమలను, చెదలగు జుర్రుకొని తింటుంది. వీటి నాలుక వీటి శరీరం కంటే పొడవుగా ఉంటుంది.
అలుగులలో 8 రకాల జాతులున్నాయి. ఇవి అడుగు నుండి 39 అంగుళాల వరకు పొడవుగా ఉంటాయి. వీటి బరువు 30 కిలోల దాకా ఉండవచ్చు
.
ఆడ అలుగులు మగ అలుగుల కంటే కొద్దిగా చిన్నవిగా ఉంటాయి. ఇవి షుమారు ఐదు నెలలపాటు గర్భం ధరించి ఒకే ఒక పిల్లను కంటుంది. అలుగులు క్షీరదాలు అనగా తల్లిపాలు తాగి పెరిగే జంతువులు. పిల్ల అలుగు తల్లిదగ్గర మూడు నుండి నాలుగు నెలల దాకా పాలు తాగి పెరుగుతుంది.తరువాత కీటకాలను తినటం మొదలు పెడుతుంది. పిల్ల అలుగులు రెండు సంవత్సరాలకు పూర్తిగా ఎదిగి సంతాన సామర్థ్యం పొందుతాయి.
వీటి జీవితకాలం ఇరవై సంవత్సరాలు. వీటికి ప్రధాన శత్రువులు మానవులే. వీటిని వీటి చర్మం కోసం, మాంసం కోసం వేటాడుతారు. చైనా వారు కీళ్లనొప్పులను అలుగు మాంసం తగ్గింస్తుందని నమ్ముతారు. కానీ శాస్త్రీయంగా ఈ విషయం నిరూపించబడలేదు.