ముళ్లపందులు ఎలుకల జాతికి చెందినవి. బలమైన పొట్టి కాళ్లతో ఉంటాయి. వీటి వెంట్రుకలే రూపాంతరం చెంది బలమైన, పొడవైన ముళ్లుగా మారతాయి. ఇవి తేలికగా ఉండి వీటి శరీరంనుండి విడిపోయి, వీటిమీద దాడిచేసిన జంతువు శరీరంలో గుచ్చుకుంటాయి. అందువలనే సాధారణంగా ఇతర జంతువులు వీటిని తొందరగా వేటాడవు.
ఇవి చెట్ల తొర్రలలో పగలంతా విశ్రాంతి తీసుకుకుని రాత్రి పూట ఆహారం కోసం బయటకు వస్తాయి. ఇవి గడ్డి మైదానాలలో, పర్వతాలలో, ఎడారులలో కూడా నివసిస్తాయి.
ఇవి ఆకులను, గడ్డి, పండ్లను, చెట్ల బెరడును, కొమ్మలను తింటాయి. ఇవి ఎక్కవగా శాఖాహారులు. భారతదేశానికి చెందిన ముళ్లపందులు 2 కిలోల నుండి 17 కిలోల దాకా పెరుగుతాయి
వీటిలో ఆడ ముళ్లపందులు 16 నుండి 31 వారాలపాటు గర్భం ధరించి ఒకటి నుండి మూడు పిల్లల వరకు కంటాయి. ఇవి షుమారు 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి.