కుందేళ్లు పొడవైన చెవులతో, పొట్టికాళ్లతో, పొట్టి తోకతో ఉంటాయి. కుందేళ్లలో మొత్తం 30 రకాల జాతులున్నాయి. వీటి బరువు నాలుగున్న కిలోలు ఉంటుంది. 20 అంగుళాల పొడవు ఉంటాయి. ఆడ కుందేళ్లు కొద్దిగా చిన్నవిగా ఉంటాయి. కుందేళ్లు పూర్తిగా శాఖాహారులు. ఇవి ఎక్కువగా పొదలలోనూ గడ్డి మైదానాలలో ఉంటాయి.
వీటికి సంతాన సామర్ధ్యం ఎక్కువ. సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు పిల్లలను కంటాయి. మూడు నుండి ఎనిమిది పిల్లల దాకా కంటాయి. కేవలం రెండు నుండి మూడు నెలలలో కుందేళ్లు పూర్తిగా ఎదుగుతాయి.
కుందేళ్లు పండ్లు, విత్తనాలు, చెట్ల బెరడును, మొలకలను కూరగాయలను తింటాయి. ఇవి సాధు ప్రవర్తన కలిగి ఉంటాయి. మనుషులు వీటిని పెంచుకుంటారు. వీటి జీవితకాలం 8 నుండి 12 సవంత్సరాలు. వీటికి శత్రువులు ఎక్కువ. అడవిలోని అన్ని క్రూరమృగాలు వీటిని వేటాడి తింటాయి. వేటగాళ్లు కూడా వీటిని వేటాడుతారు.