ఖడ్గమృగం పెద్ద జంతువు. దీని బరువు షుమారు 1800 కిలోల నుండి 2,700 కిలోల దాకా ఉంటుంది. 11.5 అడుగుల పొడవు ఉంటుంది. వీటికి కంటి చూపు తక్కువగా ఉంటుంది. కానీ వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది.
గడ్డి వీటి ప్రధాన ఆహారం,. పండ్లు, ఆకులను కూడా తింటాయి. ఇవి భారీ శరీరంతో ఉన్నా కూడా గంటకు 30 మైళ్ల వేగంతో పరిగెత్తగలవు. ఇవి వేడిని తట్టుకోలేవు. ఎండ ఎక్కువగా ఉన్నపుడు నీటిలో ఉంటాయి.
వీటి కొమ్ములు చాలా విలువైనవి. వీటి కోసం వేటగాళ్లు వీటిని వేటాడటం వలన వీటి సంఖ్య తగ్గిపోతుంది. మానవులే వీటికి ప్రధాన శత్రవులు. వీటిని చంపి చర్మం, శరీర భాగాలు అమ్ముకుంటారు. మానవుల తరువాత పులులు వీటికి శత్రువులు. పెద్దవాటిని పులులు చంపులేవు కానీ వీటి పిల్లలను చంపి తింటాయి.
ఆడ ఖడ్గమృగం 15-16 నెలలపాటు గర్భం ధరించి పిల్లలను కంటుంది. భారతదేశ ఖడ్గమృగాలు 35 నుండి 45 సంవత్సరాల పాటు జీవిస్తాయి. భారతదేశంలో వీటిని వేటాడటం నిషేదించబడింది.