సింహం తరువాత అడవి జంతువులలో అత్యంత బలమైనది, క్రూరమైనది పులి. ఇది కూడా పిల్లి జాతికి చెందినదే. అంతరించిపోతున్న జంతువులలో పులి కూడా ఒకటి.
ప్రపంచంలోని మొత్తం పులులలో భారతదేశంలోనే సగం ఉన్నాయి. ఇవి మూడడుగుల ఎత్తుతో, 230 కిలోల బరువుతో బలంగా ఉంటయి. సైబీరియన్ పులులు 13 అడుగుల పొడుగు ఉంటుంది.
తెల్లపులులు (Bengal Tigers) ఒక్క భారతదేశంలోనే కనిపిస్తాయి. బర్మా, బంగ్లాదేశ్, తూర్పు భారతంలో అప్పుడప్పుడూ నల్ల పులులు కనిపిస్తాయి.
పులులు నీళ్లలో నేర్పుతో ఈద గలవు. ఇవి చెట్లు ఎక్కగలవు. ఇవి సాధారణంగా రాత్రిపూట వేటాడుతాయి. వీటికి జింకలు మరియు అడవి పందులంటే ఇష్టం. వీటిని వేటాడటానికి ఇష్టపడతాయి.
అడవులకు దగ్గరలో కొన్ని గ్రామాలుంటాయి. వీరు పెంచుకునే పెంపుడు జంతువుల మీద పులులు అప్పుడప్పుడూ దాడి చేసి వాటిని తింటాయి. ఆవుదూడలు, మేకలు, గొర్రెలు మొదలగు వాటిమీద దాడి చేసి చంపి తీసుకుకెళతాయి. పులులు మనుషుల మీద అరుదుగా దాడి చేస్తాయి.
ఆడపులులు మగపులుల కంటే కొంచె చిన్నవిగా ఉంటాయి. వీటి గర్భధారణ సమయం మూడు నెలలు. రెండు నుండి మూడు పిల్లలు దాకా పెడతాయి. పులిపిల్లలు పుట్టినపుడు వాటికి చూపు ఉండదు. ఎనిమిది వారాల తరువాత మాత్రమే చూడగలవు.
సాధారణంగా పులుల జీవితకాలం 11 సంవత్సరాలు మాత్రమే. పులి పుట్టిన రెండు సంవత్సరాల తరువాత మాత్రమే స్వంతంగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకోగలవు. వీటిని వేటాడం నిషేధించబడింది.