అడవి పందులను మానవులు పెంచుకునే పందిజాతి పూర్వీకులుగా చెపుతారు. ఇవి పొడవైన బండమూతితో, చిన్న కళ్లు, పెద్ద చెవులతో ఉంటాయి. ఇవి ఎక్కువగా అడవులలోనూ, గడ్డి మైదానాలలో నివసిస్తాయి.
వీటి ఆహారం పండ్లు, నేలలో దొరకే దుంపలు, గింజలు. ఎలుకలను కూడా తింటాయి. ఇవి తమ బలమైన ముట్టెతో (నోరు) నేలను తవ్వి దుంపలను బయటకు లాగి తింటాయి.
ఆడ పందులు షుమారు 140 రోజుల గర్భధారణ తరువాత ఒకేసారి 14 పిల్లల దాకా కంటాయి. దాదాపు మూడు నెలల పాటు పిల్లపందులకు పాలిస్తాయి. ఇవి సాధారణంగా 10 నుండి 15 సంవత్సరాలు పాటు జీవిస్తాయి. వీటిని మానవులు పెంచుకుంటారు. వీటికి ప్రధాన శత్రువు మనిషే. వీటి మాంసం కోసం వేటాడుతారు. సింహాలు, పులులు కూడా వీటిని వేటాడి తింటాయి.