తోడేళ్లు మాంసాహారులు. కుక్కజాతికి చెందినవి. ఇవి రెండు జాతులు గ్రే కలర్ లోనూ చెక్క కలర్ లోనూ ఉంటాయి. ఇవి పొడుగైన కాళ్లతో, పెద్ద పాదాలతో ఉంటాయి. వీటికి బలమైన దవడలు, పొడవైన కోర పళ్లు ఉంటాయి.
ఇవి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఇవి షుమారుగా 65 కిలోల బరువుతో, రెండున్నర అడుగుల ఎత్తుతో ఉంటాయి. ఆడ తోడేళ్లు కొద్దిగా చిన్నవిగా ఉంటాయి.ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. గుంపులుగానే వేటాడుతాయి.
ఇవి క్రూరమైనవి. మనుషులమీద, మనుషులు పెంచుకునే పెంపుడు జంతువుల మీద కూడా దాడిచేసి తింటాయి.
ఆడ తోడేళ్ల గర్భధారణ సమయం కేవలం రెండు నెలలు మాత్రమే. ఒక సారి ఆరు పిల్లల దాకా పెడతాయి. వీటి పిల్లలకు తొమ్మిది వారాలపాటు పాలు ఇస్తాయి. తరువాత మాంసాహారం తినిపిస్తాయి.
ఇవి కొండ గుహలలోనూ, భూమిని తొలచి చేసిన బొరియలలోనూ నివసిస్తాయి. ఇవి రాత్రి సమయంలో వేటాడుతాయి. జింకలను, ఎద్దులను, గొర్రెలను, ఎలుకలను, పందికొక్కులను వేటాడి తింటాయి. ఇవి మనుషుల పెంచుకునే పశువులు, కోళ్లు, గొర్రెల మీద కూడా దాడిచేసి చంపి తింటాయి.
వీటి జీవితకాలం షుమారు 13 సంవత్సరాలు. కానీ చాలా తోడేళ్లు చాలా 13 సంవత్సరాలకు ముందే మరణిస్తాయి. వీటికి ప్రధాన శత్రువులు మనుషులే.