చారల గుర్రాలు, గుర్రాల జాతికి చెందినవి. వీటి కాలి అడుగు భాగంలో గిట్ట ఒకటిగా ఉంటుంది.చీలి ఉండదు. దీనివలన ఇవి వేగంగా పరిగెత్తగలవు. ఇవి నాలుగున్న అడుగుల పొడవు కలిగి ఉంటాయి. వీటి శరీరం మీద తెలుపు నలుపు చారలు ఉంటాయి. మగ జీబ్రాలు కంటే ఆడ జీబ్రాలు చిన్నవిగా ఉంటాయి. ఇవి 5 అడుగుల పొడవు, షుమారు 700వందల కిలోల బరువు ఉంటాయి. ఇవి ఎక్కువగా గడ్డిని తింటాయి. కొన్నిసార్లు ఆకులను కూడా తింటాయి. ఆహారం, నీల్ల కోసం కోసం కొన్ని మైళ్లదూరం కూడా ప్రయాణిస్తాయి.
ఆడ జీబ్రా 12 నుండి 14 నెలలపాటు గర్భం ధరించి పిల్లను కంటుంది. జీబ్రా పిల్ల పుట్టిన వెంటనే నడవగలదు. తల్లి జీబ్రా ఒక సంవత్సరం పాటు పిల్ల జీబ్రాకు పాలు ఇస్తుంది. పిల్ల జీబ్రా మూడు నుండి ఆరు సంవత్సరాలలోపు పూర్తిగా ఏదుగుతుంది. వీటి జీవిత కాలం 25 సంవత్సరాలు.
ఇవి గుంపులు గుంపులు గా ఉంటాయి. కలసి తింటాయి, తిరుగుతాయి. హైనాలు, సింహాలు వీటికి ప్రధాన శత్రువులు.