header

Bavikonda, Famous Buddhist Place

bavikonda bouddha stupam బావికొండ ఆంధ్రప్రదేశ్ లోని బౌద్ధమత క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ బౌద్ధమత అవశేషపు ధాతువుల దొరికిన క్షేత్రం కూడా.విశాఖపట్నంలో సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తుగల ఒక కొండపై ఉన్నది.
కొండలపైన కురిసిన వర్షపు నీరు వృధాకాకుండా నిల్వచేసుకోవటానికి అనేక బావులుండటంతో బావికొండ అని పేరు వచ్చింది. బావికొండ బౌద్ధారామం క్రీ.పూ మూడవ శతాబ్దానికి చెందినది.
ఇక్కడ జరిగిన తవ్వకాలలో ఒక పెద్ద బౌద్ధ సముదాయం బయల్పడింది. ఒక మట్టి కలశంలో దొరకిన ఎముక ముక్కను బుద్ధుని భౌతిక అవశేషమని భావిస్తున్నారు. ఇంకా అనేక శాసనాలు, మట్టి పాత్రలు, ఫలకాలు, ఇటుకలు, నాణేలను కూడా రాష్ట్ర పురాతత్వశాఖ వారు సేకరించి బధ్రపరచారు.
బావికొండకు సమీపంలో మరో రెండు బౌద్ధ సముదాయాలున్నాయి. అవి తొట్లకొండ మరియు పావురాలకొండ
ఎలా వెళ్లాలి : బావికొండ బౌద్ధ సముదాయం విశాఖపట్నం నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల నుండి రైలు మరియు బస్ సౌకర్యం కలదు