చందవరం బౌద్ధారామం అతి పురాతన బౌద్ధక్షేత్రాలలో ఒకటి. చందవరం గ్రామం ప్రకాశం జిల్లాలో ఉంది. ఇది దొనకొండ రైల్వే స్టేషన్‌కు ఈశాన్యంలో 10కి.మీ దూరంలో గుండ్లకమ్మ నదీతీరంలో ఉన్నది. శాతవాహనుల పాలనలో క్రీ.పూ 2వ శతాబ్ధంలో నిర్మించబడింది. ఇది అంద్రప్రదేశ్‌లో నిర్మించబడిన మొదటి బౌద్ధారామంగా నమ్ముతున్నారు. దీని ఉనికిని 1964 సం.లో డాక్టర్ వేలూరి కృష్ణశాస్త్రి కనుగొన్నాడు.
మహాస్థూపం ప్రధాన గోపురం చుట్టుకొలత 120 అడుగులు ఎత్తు 30 అడుగులు. స్థూపంలో ధర్మచక్రం, హిందూయిజం, జైనిజం మరియు బుద్ధిజం మతసంబంధిత చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రదేశంలో స్థూపం కాక పలు విహారాలు, బ్రాహ్మి వ్రాతలు ఉన్న ఇతర స్థూపాలు ఉన్నాయి. మహాస్థూపంలో మాహాచైత్య 1.6 మీ ఎత్తు మరియు 60 సెమీ వెడల్పు ఉంటుంది. మహాస్థూపం తక్షశిల (పాకిస్థాన్) లోని ధర్మరాజికా స్థూపాన్ని పోలి ఉంటుంది. మహాస్థూపం పానెల్స్ లైమ్ స్టోన్‌తో చేయబడింది. పానెల్స్ మరియు డ్రమ్ విభాగంలో ‘‘ బుద్ధుని పాద ముద్రలు ’’ ఉన్నాయి. స్థూపాలు, బోధి చెట్టు మరియు ఇతర కథలతో పాటు జాతక కథలు చెక్కబడి ఉన్నాయి. 1964 నుండి చందవరం ఆరామ ప్రదేశంలో 4 మార్లు త్రవ్వకాలు జరపబడ్డాయి. ఇందులో 15 సాధారణ స్థూపాలు 100 చిన్న స్థూపాలు కనుగొనబడ్డాయి.
ఇక్కడ ఉన్నవాటిలో ప్రధానమైనవి ప్రధానమైనవి మహాస్థూపం,మాహాచైత్యం, మ్యూజియం
ఇక్కడ బౌద్ధమత సంబంధిత కార్యక్రమాలు చురుకుగా సాగేవి. ఇక్కడ త్రవ్వకాలలో లభించిన వస్తువులను పరిశోధించిన తరువాత " రేడియోకార్బన్ డేటింగ్ " విధానంలో బౌద్ధారామం వయసు క్రీ.పూ 2వ శతాబ్ధంనాటిదని నిర్ణయించబడింది. చందవరం బౌద్ధారామం వారణాశి నుండి కంచి వెళ్ళే బౌద్ధసన్యాసులకు విశ్రాంతి ప్రదేశంగా ఉపయోగించబడింది. " అయాకా పిల్లర్లు" ఈ బౌద్ధారామంలో లేకపోవడం ఈ ప్రాంతం హీనయాన బౌద్ధమతానికి (హీనయానానికి చెందిన వారు బుద్ధుని విగ్రహాలకు పూజచేస్తారు) చెందినడనడానికి ప్రబలనిదర్శనంగా నిలిచింది. ఇక్కడ కొండశిఖరం మీద రెండస్థుల స్థూపం ఉంది. సాంచి స్థూపం తరువాత చందవరం బౌద్ధస్థూపం ప్రాధాన్యత కలిగి ఉంది. బౌద్ధస్థూపం ఉన్న కొండను సింగరకొండ అంటారు.
ఒంగోలు నుండి వెళ్లవచ్చు. ఒంగోలు పట్టణం విజయవాడ నుండి మద్రాసు వెళ్లే జాతీయరహదారిమీద విజయవాడకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలోని రైల్వే స్టేషన్ ఒంగోలు.