దంతపురం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన చిన్న గ్రామం. ఇక్కడ జరుపబడిన త్రవ్వకాలలో బౌద్ధమతానికి చెందిన పురాతన వస్తువులు, స్థూపాలు, టెర్రాకోట పూసలు, రాతి పాత్రలు, ఎముకలతో చేసిన దువ్వెనలు బయటపడ్డాయి. బుద్ధుని దంతం ఇక్కడ భద్రపరచబడినది కనుక ఈ ప్రాంతానికి దంతపురం అనే పేరు వచ్చిందంటారు.