జీలకర్రగూడెం ఆంధ్రప్రదేశ్ లోని పశ్ఛిమగోదావరి జిల్లాలోని గుంటుపల్లి మండలంలోని ఒక గ్రామం. కామవరపుకోటకు 6.4 కి.మీటర్ల దూరంలో ఉన్నది. జీలకర్రగూడెం బౌద్ధారామం ఆసియాఖండంలోనే రెండవ పెద్ద ఆరామంగా పేరుపొందినది. ఇది క్రీస్తుపూర్వం రెండవశతాబ్ధం, మూడవశతాబ్ధాల నాటిదిగా భావించబడుచున్నది.
ఇక్కడ పురావస్తుశాఖ వారు జరిపించిన త్రవ్వకాలలో బౌద్ధభిక్షువుల విశ్రాంతిమందిరాలు, స్థూపాలు, బౌద్ధమతానికి చెందిన కొన్ని వస్తువులు, 6 బుద్ధవిగ్రహాలు బయటపడ్డాయి. ఇటుకలతో కట్టబడిన స్థూపాలు, శిధిలావస్థలో ఉన్న మండపాలు, చిన్న చిన్న గదులతో కూడిన ఆరామాలు, రాతిలో చెక్కబడిన స్థూపాలను చూడవచ్చు