కొత్తూరు పురాతన బౌద్ధక్షేత్రం ధనదిబ్బలు మరియు పాండవుల గుహలుగా పిలువబడే కొత్తూరు గ్రామంలో ఉన్న బౌద్ధ గుహలు. ఇక్కడ మహాస్థూపం మరియు బౌద్ధ సన్యాసులు నివసించిన గుహల శిధిలాలు ఉన్నాయి.ఇది శారదానదీ తీరంలో ఉన్నది. ఈ గుహల ప్రాంతంలో క్రీ.పూ. 1 శతాబ్ధం నుండి క్రీ.శ 2వ శతాబ్ధం వరకు బౌద్ధ సన్యాసుల ఉండేవారని విశ్వసిస్తున్నారు.
ఈ ప్రాంతాన్ని ఇక్కడివారు‘‘ ధనదిబ్బలు’’ అని పిలుస్తుంటారు. ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఆర్కియాలజీశాఖ త్రవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ విహారాలు మరియు శిలాశాసనాలు బయల్పడుతూనే ఉన్నాయి. మహాస్థూపం సమీపంలో చిన్న రాతి పీపాలు ఉన్నాయి. ఈ రాతిపీపాలలో ఆనాడు నీటిని నిల్వచేసుకునేవారట. కొండనుండి కొతదూరం పోయిన తరువాత అక్కడక్కడా ఇటుకలు ఊడిపోయిన బౌద్ధవిహారాలు ఉన్నాయి.మరికొంత దూరంలో రాతిని తొలిచిచేసిన 5 గుహలు ఉన్నాయి. ఈ గుహలను పాండవుల గుహలు అని ప్రాంతీయులు చెపుతుంటారు. సరైన రక్షణ లేని కారణంగా ఇటుకలను ప్రజలు వారి నిర్మాణాలకు వాడుకుంటున్నారు. అవశేషాల చుట్టూ కంచె నిర్మించబడింది. ఆర్కియాలజీశాఖ ఇక్కడ ఒక పూదోటను నిర్వహిస్తున్నారు