పావురాలకొండ లేక నరసింహకొండ బౌద్ధమతానికి చెందిన ప్రాంతం. క్రీ.పూర్వం ఒకటి నుండి రెండవ శతాబ్ధాలకు చెందినదని అంటారు. ఇక్కడ వర్షపు నీటిని నిలువచేయటానికి రాతిలో తొలచబడిన పీపాలు బయల్పడ్డాయి. ఇంకా త్రవ్వకాలలో చైత్య గృహాలు, సాధారణ వరండాలు బయల్పడ్డాయి. పావురాలకొండ సమద్రమట్టానికి 168 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఇక్కడకు దగ్గరలోనే గోస్తనీ నది ప్రవహిస్తున్నది.
ఎలా వెళ్లాలి : విశాఖపట్నానికి 24 కి.మీ. దూరంలో భీమిలికి పశ్చిమదిశలో ఉన్నది.