header

Salihundam Famous Buddhist Place

శాలిహుండం

salihundam bouddha stupam శాలి హుండం ప్రసిద్ధ బౌద్ద క్షేత్రం శ్రీకాకుళం జిల్లా, గార మండలంలో ఉన్నది. వంశధారానది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్నగ్రామము. వంశధార నది ఒడ్డున ఉన్న బౌద్ద ఆరామాలు మరియు శిథిలమైన దేవాలయాలతో కనువిందు చేయు ప్రకృతితోనూ కనువిందు చేసే అందమైన క్షేత్రం. పూర్వము శాలిహుండానికి శాలివాటిక -బియ్యపు ధాన్యాగారము అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక -ఎముకల పెట్టె అని కూడా పిలిచేవారు.
పూర్వపు ఓడరేవు పట్టణమైన కళింగపట్నానికి పడమర వైపు 5 కిలోమీటర్ల దూరములో ఉంది. శాలిహుండంలోని శిథిలాలు చాలామటుకు బౌద్ధకాలానికి చివరిదశలోనివిజ. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు. శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు.
ఆ తరువాత ఈ ప్రదేశములో ఎ.హెచ్.లాంగ్‌హర్స్ట్, టి.ఎన్.రామచంద్రన్ మరియు ఆర్.సుబ్రహ్మణ్యన్ తదితరులు త్రవ్వకాలు. త్రవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు స్థూపాలు, ఒక చైత్య గృహము మరియు అనేక శిల్పాలు బయటపడ్డాయి. క్రీ.పూ.2వ శతాబ్దము నుండి 12వ శతాబ్దము వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన మరియు హీనయాన మొదలైన మూడు బౌద్ధమత శాఖలను ప్రతిబింబిస్తున్నాయి