>
header

Thotlakonda Famous Buddhist Place

తొట్లకొండ

thotlakonda bouddha stupam తొట్లకొండ బౌద్ధ సముదాయం విశాఖపట్నం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో భీమిలి వెళ్లే దారిలో సముద్రతీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తున్న ఒక కొండపై ఉంది. కొండపై వర్షపు నీటిని సేకరించడానికి రాతిలో తొలచిన అనేక తొట్లు ఉండటంవలన తొట్లకొండ అని పేరు వచ్చింది. తొట్లకొండ ప్రాచీన కళింగ ప్రాంత ప్రభావంలో ఉండి ఇక్కడ నుండి బౌద్ధ సంస్కృతి శ్రీలంక మరియు తదితర ఆగ్నేయాసియా దేశాలలో వ్యాపించేందుకు ప్రధాన కేంద్రంగా దోహదం చేసింది. తొట్లకొండ, భారతీయ సంస్కృతికి ముఖ్యంగా బౌద్ధం ఖండాంతర ప్రదేశాలకు ప్రసరించిన పద్ధతికి అద్దంపడుతుంది. తొట్లకొండ 120 ఎకరాలలో విస్తరించియున్నది. భారతీయ నావికాదళం (నేవీ) వారి సర్వేలో ఈ తొట్లకొండ బయటబడ్డది. విశాఖపట్టణం నుండి వెళ్లవచ్చు.