లేపాక్షి చారిత్రత్మకం మరియు బౌగోళికంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతం. భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన 108 శివాయాలలో లేపాక్షి ఒకటి అని స్కంధపురాణంలో లేపాక్షి గురించి చెప్పబడియున్నది.
16వ శతాబ్ధంలో పెనుగొండ కోటలో ఖజానా అధికారిగా ఉన్న విరుపన్న వీరభద్రస్వామి ఆలయాన్ని కట్టించాడని చారిత్రక ఆధారాలున్నాయి. క్రీ.శ. 1530లో కట్టబడినది భావించుచున్న నృత్యశాల 100 స్థంబాల మీద కట్టబడి ఆనాటి శిల్పకళకు దర్పణం పట్టుచున్నది. నిలువెత్తు వీరభద్రుని విగ్రహం, నంది విగ్రహం. ఎగిరే గంధర్వుల బొమ్మలు, నాగలింగం, గణేశ విగ్రహాలు చూపరులకు కనువిందు చేస్తాయి. మంటపం మధ్యలో 21 అడుగుల ఎత్తున్న పద్మం ప్రత్యేక ఆకర్షణ. ప్రతి సోమవారం ఇక్కడ ప్రత్యేకపూజలు జరుగుతాయి.
ఆశ్వయుజ మాసంలో (ఫిబ్రవరి) 10రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు అనంతపురం జిల్లానుండియే కాక దూర ప్రాంతాలనుండి కూడా భక్తులు అధికసంఖ్యలో వస్తారు.
ఎలా వెళ్లాలి : లేపాక్షి అనంతపురానికి 110 కి.మీ. దూరంలో ఉన్నది. రోడ్డుమార్గంలో (బస్సులో) వెళ్ళవచ్చు. హిందూపుర్‌కి 15 కి.మీ. దూరంలో ఉంటుంది. హిందూపూర్‌కు రైలు మార్గంలో వెళ్ళవచ్చు.