header

Boyakond Gangamma Temple / బోయకొండ గంగమ్మ దేవాలయం

Boyakond Gangamma Temple / బోయకొండ గంగమ్మ దేవాలయం

బోయకొండ గంగమ్మను శక్తి అవతారంగా మరియు శ్రీనివాసుని సోదరిగా భావిస్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడున్న బోయకొండ చుట్టుపక్క బోయలు, యెలికా అనే కొండజాతి వారు నివసించేవారు. అప్పట్లో నవాబు ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది. ఒకసారి నవాబు సైన్యానికి మరియు బోయలు, యెలిక వారికి ఘర్షణ జరిగి ఈ కొండజాతి వారు నవాబు సైన్యాన్ని తరిమి కొడతారు. గోల్కొండ నవాబు తిరుగుబాటును అణిచి వేయటానికి అదనపు సైన్యాన్ని పంపుతాడు. కోయవారు నవాబు సైన్యాన్ని ఎదిరించలేక గంగమ్మ శరణు కోరతారు. గంగమ్మతల్లి నవాబు సేనను నాశనం చేసి వారి తలలను ఇక్కడున్న రావి చెట్టు కొమ్మకు వేలాడతీసిందని ఇక్కడి ప్రజలు చెబుతారు
గంగమ్మతల్లి విజయానికి గుర్తుగా బోయలు బోయకొండపై గంగమ్మ తల్లి ఆలయాన్ని కడతారు. కొండకింద పెద్ద మంచినీటి బావి ఉన్నది. ఈ బావిలోని నీరు అనేక చర్మ సంభందిత రోగాలను నయం చేస్తుందని స్థానికులు విశ్వసిస్తారు. అంతేకాదు ఈ నీటిని పంటపొలాలలో చల్లుతారు.
ప్రతి సంవత్సరం అక్టోబరులో నవరాత్రికి అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు దక్షిణాది నుండి పెద్దసంఖ్యలో భక్తులు వస్తారు. ఈ దేవాలయం 1990 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ దేవాలయల, ధర్మాదాయ శాఖవారి పరిపాలనలోనికి వచ్చింది. అప్పటి నుండి భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి జరుగుచున్నది.
ఎలా వెళ్ళాలి ? : బోయకొండ గంగమ్మ గుడి చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామంలో ఉంది. తిరుపతికి దగ్గరలో ఉన్న పుంగనూరు నుండి 16 కి.మీ. మరియు మదనపల్లికి 20 కి.మీ. దూరంలో బోయకొండ గంగమ్మ దేవాయలయం ఉన్నది.