గోవిందరాజస్వామి శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క సోదరుడుగా భావించ బడుచున్నాడు. తిరుపతి పట్టణంలోనే ఉన్న గోవిందరాజస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది.
తిరుమల వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ స్వామిని కూడా దర్శించు కొంటారు. ఈ ఆలయ గోపురం ఎత్తుగా ఉండి చాలా దూరం నుండి కూడా కనబడుతుంది. ఈ గోపురం 1628సం.లొ ఎడు అంతస్తులతో నిర్మించబడి చూపరులను ఆకట్టుకొంటుంది. ఈ గోపురానికి ఎడమ ప్రక్కన పద్మంలో కూర్నున్న లక్ష్మీదేవి ఆలయాన్ని చూడవచ్చు.
ఈ ఆలయంలో గోవిందరాజస్వామితో పాటు రుక్మిణి , సత్యభామ విగ్రహాలను కూడా చూడవచ్చు. దేవాలయం యొక్క శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. మరియు శ్రీవైష్ణవ కవి వేదాంత దేశిక వారి విగ్రహాన్ని కూడా చూడవచ్చు.