అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ లోని పేరుపొందిన ఆలయాలలో అన్నవరం దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ప్రతి రోజూ భక్తులతో సందడిగా ఉంటుంది.
భక్తుల పాలిట కొంగుబంగారంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరం గ్రామంలో రత్నగిరి అనే కొండపై కట్టబడింది. ఆలయ సమీపంలో పంపానది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించేందుకు ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయబడింది. మెట్లమార్గం గుండా కూడ నడచి వెళ్ళవచ్చు.
అన్నవరం అనగానే సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండుగగా జరుపుకోవటం గుర్తుకు వస్తుంది. ఇక్కడ స్వామివారి ప్రసాదం తిరుపతి లడ్డూ ప్రసాదం లాగా పేరుపొందినది
.
దర్శన సమయాలు :
సర్వదర్శనం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12-30 నిమిషాల వరకు
మరియు మధ్యాహ్నం గంటల 1 నుండి రాత్రి 9-00 గంటల వరకు
వసతి సౌకర్యం: యాత్రికులు బస చేయటానికి దేవస్థానం వారి కాటేజ్ లు మరియు సత్రాలు అందుబాటులో కలవు.
ఎలా వెళ్లాలి...? అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారిపై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడకి 45 కి.మి. దూరంలో ఉంది. అన్నవరం గ్రామంలో రైల్వే స్టేషన్ కలదు. విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది. రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్లవచ్చు.
వసతి. పూజలు మరియు ఇతర వివరాలకు ఈ క్రింది వెబ్ సైట్ సందర్శించండి :
Devasthanam Website :
www.annavaramdevasthanam.nic.in