Chennakesava Swamy, Macherla / చెన్నకేశవస్వామి ఆలయం – మాచర్ల గుంటూరు జిల్లా మాచర్ల గ్రామంలో ఉందీ చెన్నకేశవ (విష్షుమూర్తి) స్వామి ఆలయం. కార్తవీరార్జుని వంశీయులు క్రీ.శకం 11వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. తరువాత కాలంలో సాగిపేట అనుగురాజు (హైహవ వంశీయుడు) జీర్ణోద్ధరణ గావించాడు. తరువాత 13 వ శతాబ్ధంలో బ్రహ్మనాయుడు ఈ ఆలయానికి మరమ్మత్తులు చేయించాడని తెలుస్తుంది. మేదాంబిక కుమారుడైన ఆదిత్యుడు ఆలయంలో నాగస్థంభ ప్రతిష్ట చేసి శాసనం చెక్కించాడు. దీనిపై మాచర్ల పట్టణ చరిత్ర చెక్కబడి వుంది. దీనిపై మాచర్ల పట్టణ చరిత్ర చెక్కబడి వుంది. దక్షిణాదిన సాధారణంగా నదులన్నీ పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. అయితే ఇక్కడ చంద్రవంక నది మాత్రం తూర్పు పశ్చిమల నుండి ఉత్తరం వైపుగా మళ్ళే చోట ఈ చెన్నకేశవ ఆలయం ఉంది. ఈ స్థల మహత్యం వలనే చెన్నకేశవ ఆలయం మహిమాన్యిత క్షేత్రంగా పేరుపొందినది అంటారు. రంగమంటపంలోని నాలుగు స్థంభాలపై భారత, భాగవత, రామాయణ గాథలు చెక్కబడి వున్నాయి. చోళరాజుల కాలంనాటి శిల్పకళ దేవాలయ పండపాల స్థంభాలపై కనపడుతుంది. శిల్పకళ హనుమకొండలోని వేయు స్థంభాల గుడిని పోలివుంటుంది. దేవాలయం లోపల చుట్టూ ప్రదక్షణ చేయటానికి పది స్థంభాలతో ప్రదక్షణా మార్గం ఏర్పాటు చేశారు. గర్భాలయాన్ని పదహారు స్థంభాలతో మలచిన తీరు అప్పటి శిల్పుల నైపుణ్యానికి అద్ధం పడుతుంది. రధోత్సవం బ్రహ్మోత్సవ సమయంలో రధోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణ. రాష్ట్రంలోనే పెద్దరథాలలో చెన్నకేశుని రథం రెండవదిగా పేరుపొందినది. 128 సంవత్సరాలుగా ఈ రథోత్సవం జరుగుతుంది. ఎలా వెళ్ళాలి : మాచర్ల పట్టణం గుంటూరుకు 110 కి.మీ. దూరంలోనూ నాగార్జునా సాగర్ కు 25 కి.మీ. దూరంలోనూ ఉంటుంది.