Daida Bilam / అమరలింగేశ్వరస్వామి, దైద : గుంటూరు జిల్లా, గురజాల మండలం, దైద గ్రామంలో పవిత్ర కృష్ణానది ఒడ్డున సొరంగమార్గంలో వెలిసి అమరలింగేశ్వరుని శివాలయం ఉన్నది.సొరంగమార్గంలో స్వయంభువుగా వెలసిన ఈ స్వామిని దర్శించుకొనటానికి దేవాదాయ శాఖవారు విద్యత్ సౌకర్యం కల్పించారు. సొరంగ మార్గంలో 400 మీటర్లు ప్రయాణించి స్వామిని దర్శించుకోవలసి ఉంటుంది. . పైభాగంలో నాగరాజు శిలను చూడవచ్చు.
బిలంలో సన్నని మార్గాలలో పార్వతి, దుర్గాదేవి, హనుమాన్ మరియు భైరవ విగ్రహాలు చూడవచ్చు. విశాలమైన హాలులో శివలింగం మరియు నందివిగ్రహం ఉన్నవి.
ఎలావెళ్ళాలి ? గురజాల నుండి ఆటోలలో దైద గ్రామానికి వెళ్ళవచ్చు. పిడుగు రాళ్ళనుండి 25 కి.మీ. దూరంలో ఉంటుంది.