header

Guttikonda Bilam / గుత్తికొండ బిలం

guttikonda bilam Guttikonda Bilam / గుత్తికొండ బిలం చుట్టూ పర్వతాలు, మధ్యలో ప్రకృతి సహజంగా ఏర్పడిన బిల సముదాయం. బిలంలో పూర్తిగా చీకటి. విద్యుత్ దీపాల వెలుగులో లోపలకి ప్రవేశించగానే స్వచ్ఛమైన నీటితో నిండిన కొలను కనిపిస్తుంది. రూపాయు నాణెం వేసినా కనిపిస్తుంది. ఈ నీటిలో భక్తులు స్నానమాచరిస్తారు. ప్రధాన బిలం నుండి లోపలకు వెళితే 101 బిలాలున్నాయని అంటారు.
పురాణ కథనం : ద్వాపారయుగంలో శ్రీకృష్ణడు కాలయవనుని అంతమొందించేందుకు ఈ గుహలో ప్రవేశించి నిద్రిస్తున్న ముచికుందునిపై తన ఉత్తరీయాన్ని కప్పి ప్రక్కకు తప్పుకుంటాడు. కాలయవనుడి ముచికుందుని శ్రీకృష్ణునిగా భావించి నిద్రాభంగం కలిగిస్తాడు. నిద్రనుండి మేల్కొన్న ముచికుందుని చూపుకు కాలయవనుడు భస్మమవుతాడు. ముచికుందుడు ఈ వరాన్ని దేవతలనుండి పొందుతాడు.
పల్నాటియుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు గుత్తికొండ బిలంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది.
ఎలా వెళ్ళాలి : గుత్తికొండ బిలం నరసరావుపేటకు 38 కి.మీ. దూరంలో గురజాల నియోజక వర్గం, గుత్తికొండ గ్రామానికి దగ్గరలో ఉంది. (నరసరావు పేట-మాచర్ల వయా గుత్తికొండ బస్సులలో వెళ్ళవచ్చు.) గుత్తికొండ నుండి బిలం దగ్గరకు ఆటోలలో వెళ్ళవలసి ఉంటుంది. దగ్గరలోని రైల్వే స్టేషన్ పిడుగురాళ్ళ.