header

Peda Kakakani Sivalayam / పెదకాకాని శివాలయం

Peda Kakakani Sivalayam / పెదకాకాని శివాలయం గుంటూరు జిల్లా పెద కాకానిలోని సాంబశివాలయము మహా మహిమాన్వితమై యున్నది. ఈ పురాతన చరిత్రాత్మకమైన శివాలయం ఆది శంకరాచార్యుల చేత ప్రతిష్టింపబడి కృష్ణదేవరాయలచే పునః ప్రతిష్టింపబడింది మరియు రాష్ట్ర ప్రఖ్యాతి గాంచినది. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా,ఎంతో దూరం నుండి యాత్రీకులు వేలసంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతున్నది. ఈ స్వామి శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి. నవరాత్రులు, శివరాత్రి ఒకటేమిటి, నిత్య కైలాసమే ఈ క్షేత్రం.
ఈ స్వామి వారి ప్రతిభ అనేక రకాలు. ప్రతి ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కుబడులు చెల్లించుకొంటూ ఉంటారు. దూరప్రాంతాలనుండి వచ్చేవారు బస చేయటానికి సత్రాలు మరియు పొంగళ్ళు చేయటానికి తగిన వసతులు ఉన్నాయి అన్ని వస్తువులూ దొరకుతాయి ప్రభలు, బండ్లు గట్టుకొనివచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. వివాహ ఉపనయనాదులు నిర్వహించుకుంటూ స్వామి దయకు పాత్రులవుతారు. వ్యాధిగ్రస్తులు, సంతానహీనులు అక్కడనే వుండి ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేసి వారికోర్కెలను స్వామి వారికి నివేదించుకుంటారు. .
ఆలయ వేళలు : ఉదయం 5 గంటల నుండి మ.1-30 ని. ల వరకు తిరిగి సా.4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరచి ఉంటుంది.
ఎలా వెళ్ళాలి ? గుంటూరు జిల్లా లోని గుంటూరుకు దగ్గరలో గల పెదకాకాని గ్రామంలో ఈ శివాలయం కలదు. గుంటూరు నుండి విజయవాడ రహదారిలో ఉంది. గుంటూరు లేక విజయవాడ నుండి బస్సులలో వెళ్ళవచ్చు.