header

Satrasala / సత్రశాల – కాకులు వాలని పుణ్యక్షేత్రం

Satrasala / సత్రశాల – కాకులు వాలని పుణ్యక్షేత్రం గుంటూరు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కృష్ణనదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రం సత్రశాల.
ఇక్కడి దైవం మల్లయ్య స్వామి స్వయం భూలింగం. లోక కళ్యాణం కోసం విశ్వామిత్రుడు సత్రయాగాన్ని ఇక్కడ చేశాడు. దీని కోసం సత్రయాగ స్థలంలో శివలింగాన్ని ప్రతిష్టించాడు.మల్లెపూలు, అర్జున పుష్పాలతో చేసి యాగం కాబట్టి దీనిని మల్లికార్జున లింగమని కూడా అంటారు. విశ్వామిత్రుడు ఇక్కడ సత్రయాగాన్ని చేసినందువల్ల ఈ ప్రాంతానికి సత్రశాల అని పేరు వచ్చిందంటారు. విశ్వామిత్రుడు యాగం చేస్తున్న సమయంలో పలువురు రాక్షసులు యాగాన్ని చెడగొట్టేందుకు కేకలు వేయటంతో అవి కాకుల గోలగా భావించిన విశ్వామిత్రుడు సత్రశాల పుణ్యక్షేత్రంలో కాకులు వాలకుండా ఉండుగాక అని శాపం పెట్టాడట. అప్పటి నుండి నేటి వరకు కాకులు వాలని క్షేత్రమని భక్తుల విశ్వాసం. భక్తులు కృష్ణా నదిలో స్నానం చేసేందుకు 2016 కృష్ణా పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్ లు నిర్మించ బడ్డవి.
ఎలా వెళ్ళాలి ?
మాచర్ల నుండి 30 కి.మీ. దూరంలో ఉంటుంది సత్రశాల. హైదరాబాద్ నుండి బస్సులలో వచ్చేవారు పాలవాయి జంక్షన్లో దిగి అక్కడనుండి 11 కిలో మీటర్లు బస్సులలో గాని ఆటోలలో గాని ప్రయాణించి ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. గుంటూరు నుండి వెళ్ళేవారుకూడా పాలవాయి జంక్షన్ లో దిగి అక్కడనుండి ఆటోలలో వెళ్ళాలి.

div>