header

Ontimitta Kodanda Rama Swamy / ఒంటిమిట్ట కోదండ రామాలయం

కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయం ఇది. ఇక్కడ వున్న విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఒకే శిలలో ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు. మిట్టపై గుడిని నిర్మించడం వలన వొంటిమిట్ట రామాలయమని పేరు వచ్చిందంటారు. అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో ఈ దేవాలయం అరాలరుతుంది.
గోపుర నిర్మాణం చోళ సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఏకశిలా నగరమని కూడా ప్రసిద్ధి. ప్రధాన ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఆంధ్రమహా భాగవతాన్ని రచించిన పోతన కూడా తాను ఏకాశిలానగర వాసినని చెప్పుకున్నాడు. పోతన తన భాగవతాన్ని ఇక్కడే రామచంద్రునికి అంకితం గావించాడు.ఈ కవి విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. ప్రౌడదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఇతని మనుమడే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు.
ఈ దేవాలయానికి 3 గోపురద్వారాలు మరియు విశాలమైన ఆవరణ ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజు ఈ ఆలయాని మూడుదశలుగా నిర్మించారు. ఆంధ్రావాల్మీకిగా పేరుపొందిన వావిలి కొను సుబ్బారావు(1863`1936) ఈ దేవాయ పునరుద్దరణ కొరకు టెంకాయచిప్ప చేతపట్టి బిక్షాటన చేసి 10 క్ష రూపాయను ప్రోగుచేసి దేవాలయ పునరుద్దరణ మరియు మలువైన ఆభరణాలను చేయించాడు.ఇతని విగ్రహాన్ని కూడా ఇక్కద దర్శించవచ్చు.
ఒంటిమిట్ట రామాలయం సందర్శించే భక్తులను ఆకట్టుకునేది ఇమాంబేగ్‌ బావి.
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్థశినాడు కళ్యాణం, పౌర్ణమినాడు రథోత్సవం జరుగుతాయి. నవమినాడు పోతన జయంతిని జరుపుతారు
ఈ దేవాలయం కడప పట్టణానికి కడప-తిరుపతి రహదారిలో 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సుల ద్వారా ఇక్కడికి వెళ్ళవచ్చు. శ్రీ వేంకటేశ్వరుని మీద 32,000 కీర్తలను రచించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం ఇక్కడికి దగ్గరలోనే కలదు.(రాజంపేట నుండి 6 కి.మీ దూరం)