పార్వతీదేవి ప్రతిరూపంగా చెప్పబడే ఈ అమ్మవారు తొమ్మిది అడుగుల ఎత్తుకలిగి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమలో చూసేవారికి నేత్రపర్వంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం (మార్చి నెల) శుద్ధ ద్వాదశి నాడు శ్రీ జలదుర్గ, శ్రీ గోకర్ణేశ్వరస్వాముల కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది.
11వ శతాబ్ధం నాటి ఈ ఆలయం యాత్రికులకు మధురానుభూతి కలిగిస్తుంది. కొల్లేటి పార్వతమ్మను ఉత్సవాల సందరర్భంగా దర్శించుకోవటం భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు.
ఎలావెళ్ళాలి : విజయవాడ నుండి భీమవరం జాతీయ రహదారిలో (214 నెం) ఆలపాడు వద్ద దిగి ఆటోలో కర్రలవంతెన వద్దకు వెళ్ళి అక్కడనుండి లాంచీ ద్వారా లేదా ఆటోలలో అమ్మవారి క్షేత్రానికి చేరుకోవచ్చు. దగ్గరలో గల రైల్వే స్టేషన్ కైకలూరు (కైకలూరు నుండి ఆలపాడుకు రావాలి)