: ముక్తేశ్వరాలయం
శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం, ముక్య్తాల : ముక్తేశ్వరాలయం - ఆరు నెలలు మాత్రమే కనిపించే శివాలయం : కృష్ణా నదీ ఇసుకలో కట్టబడిన ఈ ఆలయం 6 నెలలు మాత్రమే భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. మిగతా 6 నెలల కాలం కృష్ణా నదీ జలాలలో మునిగి ఉంటుంది. ఈ దేవాలయం త్రేతాయుగం నాటిదని, శ్రీరాముడు సీతా సమేతంగా ఈ దేవాలయాన్ని దర్శించాడని చెబుతారు. తరువాత కాలంలో కాకతీయ రాజులు మరియు వాసిరెడ్డి రాజాస్ చే అభివృద్ధి చేయబడినది.
కృష్ణానది మధ్యలో ముక్తేశ్వరుడిగా పూజలందుకునే శివుడు.. సంవత్సరంలో ఆర్నెల్లపాటు కృష్ణమ్మ ఒడిలో మునిగిపోతాడు. ఆ సమయంలో స్వామిని దేవతలు ఆరాధిస్తారని నమ్మకం. నీటిమట్టం తగ్గినపుడు ఈ ఆలయం భక్తులకు కనిపిస్తుంది. ఇక్కడ మరో విశేషం కూడా వుంది. సాధారణంగా శివయ్యని లింగ రూపంలో చూస్తుంటాం. ఇక్కడ అమ్మవారిని కూడా లింగ రూపంలో అర్చిస్తారు. ఇక్కడ రెండు లింగాలు, రెండు నందులు, రెండు ఆలయాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ
దక్షిణం వైపు వున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు
ఎలా వెళ్ళాలి : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు నుండి వెళ్ళవచ్చు. కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మండలం మక్త్యాల గ్రామంలో ఈ ఆలయం ఉన్నది.