Nemali Venugioala Swamy / నెమలి వేణుగోపాలస్వామి ఆలయం కృష్ణాజిల్లా లో నెమలి వేణుగోపాలస్వామి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంలో గోడలపైన ఉన్న శాసనం ప్రకారం గ్రామంలోని రైతు 1953లో భూమిని సాగుచేస్తుండగా వేణుగోపాలస్వామి విగ్రహం లభ్యమైందని తెలుస్తుంది. చేతిలో వేణువుతో స్వామి నిలుచున్న భంగిమలో విగ్రహం ఉంటుంది. స్వామితో పాటు గోదాదేవి, ఆళ్వారు స్వాములను కూడా చూడవచ్చు. గోశాలలో దేశవాళి ఆవులను చూడవచ్చు. ఈ దేవాలయం విశాలమైన ఆవరణలో ధర్మశాల, కళ్యాణకట్ట, అన్నదాన సత్రం, అద్దాలమంటపం, రథశాల మొదలగునవి ఉన్నవి.
సోమ, శుక్ర వారాలలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గణమాసంలో రుక్మిణీ సమేత స్వామివారికి ఆరు రోజులపాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. యాత్రీకులకు వసతి సౌకర్యం కూడా కలదు.
సంతానం లేనివారు, ఆరోగ్యం బాగాలేనివారు, మానసిక ప్రశాంతతలేని వారు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఆలయంలో గణాచార వ్యవస్థ కనపడుతుంది. సమస్యలతో వచ్చినవారు గణాచారికి తమ సమస్యలను తెలుపుకొని సలహాలు తీసుకుంటారు.
ఎలావెళ్ళాలి ? : కృష్ణాజిల్లా గంపలగూడెం మండలానికి చెందిన గ్రామం నెమలి. (విజయవాడ-గంపలగూడెం 78 కి.మీ, గంపలగూడెం-నెమలి 28 కి.మీ.) గంపల గూడెం వెళ్ళి అక్కడ నుండి ఆటోలలో లేక బస్సులలో వెళ్ళవచ్చు.
div>