ఈ ఆలయం కృష్ణాజిల్లాలోని బందరు పట్టణంలోని చిలకలపూడి గ్రామంలో కలదు. బందర్ బస్టాండ్ నుండి 5 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేవాలయానికి బస్సులు లేక ఆటోలలో వెళ్లవచ్చు.
ఈ ఆలయం 1929 సం.లో శ్రీ భక్త నరసింహం గారిచే నిర్మించబడినది. ఈ ఆలయం మరియు స్వామివారి విగ్రహం ఒరిస్సాలోని పండరీపురం దేవాలయాన్ని పోలి ఉంటుంది. స్వామివారి ఎదురుగా అభయాంజనేయస్వామి వారి విగ్రహం ప్రతిష్టంచబడినది. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలే చిలకలపూడి సంబరాలుగా పేరుపొందినవి.
ఈ ఆలయం 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇంకా ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలను కూడా చూడవచ్చు. పాండురంగస్వామి విగ్రహం 3 అడుగుల ఎత్తులో చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయానికి చాలా దగ్గరలో సముద్రం ఉంది. సముద్రతీరానికి విహారానికి వెళ్లవచ్చు. కార్తీకమాసంలో భక్తులు సముద్రస్నానం చేసి పాండురంగస్వామిని దర్శించుకుంటారు.
ఎలా వెళ్లాలి...? కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నానికి (బందరు) విజయవాడ నుండి రోడ్డు రైలు మార్గాల ద్వారా వెళ్లవచ్చు.