పెనుగంచిప్రోలు కృష్ణా జిల్లాకు చెందిన మండలం. విజయవాడ నుండి 72 కి. మీ దూరంలోను జగ్గయ్యపేటకు 20 కి.మీ., నందిగామకు 20 కి.మీ. దూరంలోనూ ఉన్నది. దగ్గరలోగల రైల్వేస్టేషన్ విజయవాడ. హైదరాబాద్ మార్గంలో గల మధిర.(మధిర నుండి షుమారు 21 కి.మీ.)
1700 సంవత్సరంలో ఈ గుడి నిర్మాణం జరిగినది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి-మార్చి (మాఘశుద్ధ పౌర్ణమి) నెలలో 3 రోజు పాటు అమ్మవారి తిరునాళ్ళ జరుగును. కృష్ణా జిల్లా నుండి కాకుండా చుట్టు ప్రక్కల జిల్లాల నుండి అధికసంఖ్యలో భక్తులు వస్తారు.శుక్ర, శనివారాలలో రద్దీగా ఉంటుంది. భక్తులు అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. వసతి సౌకర్యాలు లేవు.
భక్తులు మొక్కుబడులు చెల్లించి, వంట చేసుకొనుటకు, వసతి, మంచినీరు, షామియానాలు మొదలగు సదుపాయాలు కల్పించి చుట్టుప్రక్క ఉన్న మామిడి తోట యజమానులు తోటలను అద్దెకిస్తారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోథుడు శ్రీ దుగ్గిరాల గోపాకృష్ణయ్య గారి జన్మస్థలం.
దర్శన సమయాలు: దేవాలయం ఉదంయ 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరచి యుండును
ఉచిత దర్శనం : ఉదయం 5 గంటల. నుండి ఉదయం 7 గంటల.వరకు
దర్శనం : రూ.5 ఉ.5 గంటల నుండి రాత్రి 9 గంటల. వరకు
శీఘ్రదర్శనం : రూ.15 ఉ.5 గంటల నుండి రాత్రి 9 గం. వరకు
అంతరాయ దర్శనం : రూ.25` ఉ.5 గంట నుండి రాత్రి 9 గం. వరకు
బ్రేక్ దర్శనం : రూ.50 ఉ.5 గంటల నుండి రాత్రి 9 గం. వరకు.