Sobhanachaka Swamy Temple / శ్రీ వ్యాఘ్రనరసింహస్వామి (శోభనాచల స్వామి) ఆలయం శ్రీ వ్యాఘ్రనరసింహస్వామి (శోభనాచల స్వామి) ఆలయం లేక శోభనచల స్వామి అని పిలవబడే నరసింహస్వామి ఆలయం కృష్ణాజిల్లా ఆగిరిపల్లి గ్రామంలో కొండపైన కలదు. పురాణాల ప్రకారం ఈ దేవాలయం 4000 సంవత్సరాల క్రితందని చెప్పబడుచున్నది. ఇక్కడ ఉన్న పుష్కరిణి 15వ శతాబ్ధం నాటిదని పురాతత్వ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. క్రీ.శ 1516 లో ఒక భక్తుడు పూలతోట మరియు భోగమండపంను ఏర్పాటు చేసినాడు. ఈ దేవాలయంనకు చేరుకోవాలంటే 740 మెట్లు ఎక్కవలసి ఉంటుంది.
ఇక్కడ ఉన్న వరాహాపుష్కరిణి మహావిష్ణు ఆదివరాహ అవతారంలో ఉన్నప్పుడు త్రవ్యాడని ఒక నమ్మిక. దీనికే అనంత సరస్సు అని పేరు. దీని జలాలను స్వామి పూజలకు ఉపయోగిస్తారు. బ్రహ్మండపురాణం 9వ అధ్యాయంలో ఈ దేవాలయం గురించి పేర్కొనబడినది.
ఆలయ వేళలు : ఉదయం 8-00 గంటల నుండి 11-00 వరకు తిరిగి సాయంత్రం 05-00 గంటలనుండి రాత్రి 07-00 గంటలవరకు