header

Chennakesava Swamy, Pattikonda / చెన్నకేశవస్వామి ఆలయం – పత్తికొండ తాలూకా, కర్నూలు

పాండవ మధ్యముడైన అర్జునుడి మనవడు పరీక్షీత్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పహత్యా సాతకం తొలగించుకోవడాని విష్ణుమూర్తి ఆలయాలను కట్టించమని పెద్దలు సలహా ఇస్తారు. దక్షిణ భారతంలో అనేక ప్రాంతాలలో విష్ణుమూర్తి ఆలయాలను కట్టిస్తాడు జనమేజయిడు. అలా కట్టిన ఆలయమే కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకాలో చెన్నకేశవుడి ఆలయం.
పూర్వం కౌండిన్య మహర్షి ఆశ్రమం ఈ ప్రాంతంలో ఉండేదంటారు. కౌండిన్య మహర్షి వేదాలను అధ్యయంనం చేసిన మహార్షి. ఆ మహనీయుని పాదధూళితో పునీతమైన ప్రాంతం కాబట్టే ఈ ఆలయానికి ప్రశస్తి. స్థల మహాత్యం : కాలక్రమంలో ఆలయం మరుగున పడి పోగా తరువాత కాలంలో ఎర్రగొల్ల కౌలుట్ల అనే పశువుల కాపరి ఈ ప్రాంతంలో పశువులను మేపుకొనేవాడు.
మందలోని ఓ పాడి ఆవు రోజూ పాలిచ్చేది కాదు. దానితో కౌలుట్ల ఆ ఆవును గమనించసాగాడు. ఆ ఆవు నేరుగా ఓ చెట్టు కిందకు వెళ్ళి అక్కడ వున్న పుట్టలో పాలు వదిలేది. స్థల మహాత్యంగా భావించి ఆ కాపరి పుట్టను తవ్వగా చెన్నకేశవుడి విగ్రహం బయటపడుతుంది. చుట్టు పక్కల గ్రామాల వారు విషయం తెలిసికొని మేళతాళాలతో వచ్చి విగ్రహాన్ని శుద్దిచేసే వేదోక్తంగా ప్రతిష్టించారు.
అప్పట్లో విజయనగరాన్ని పరిపాలించే శ్రీకృష్ణ దేవరాయలు స్వామి మహాత్యాన్ని విని చెన్నకేశవుడికి అనేక మాన్యాలిచ్చాడు.
ఈ ప్రాంతపు పరప్ప నాయిడనే పాలెగాడు అక్కడ రెండు కోనేర్లు తవ్వించాడు. అప్పట్లో అక్కడ కూచిపూడి నృత్య ప్రదర్శనలు కూడా జరిగేవంటారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. చుట్టు నక్కల గ్రామాల నుండి భక్తులు వేలాదిగా వస్తారు. శ్రావణమాసమంతా భక్తుల రద్దీ ఉంటుంది. ఇంకా ఈ ఆలయ ఆవరణలోనే భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి, విజయ వినాయక స్వామి, విశ్వనాధస్వామి ఆలయాలున్నాయి. ఆంజనేయుడు క్షేత్రపాలకుడు