header

Mahanandi…...మహానంది

Mahanandi…...మహానంది

మహానందిలో స్వామి వారు మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. మహానందాలో స్వామివారు మహానందీశ్వరుడు. అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇతర దేవతలు ఆంజనేయస్వామి, వినాయక నంది, గరుడ నంది, గోర్లయ్య మఠం ఇంకా అనేక ఉపాలయాలనుయ చూడవచ్చు. ఇక్కడి ప్రత్యేకత కోనేరు. కోనేటిలోని నీరు 5 అడుగుల లోతు ఉంటుంది. గోముఖ శిలనుండిస్వచ్ఛమైన నఅరు అన్నవవేళలలో ధారగా వస్తుంది. కోనేటిలో రూపాయి బిళ్లవేస్తే చక్కగా కనబడుతుంది. చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉండటం ఈ కోనేటిలోని నీటి ప్రత్యేకత. ఈ నీటితోనే 3000 ఎకరాల భూమి సాగుచేస్తారు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి నవనందులు అంటారు. నవనందులను చూడటానికి ఆర్ టి సి వారు ప్రత్యేక బస్సులను నడుపుచున్నారు. స్థలపురాణం: నందరాజు నందవరం, నంద్యాల, నందికొట్కూరు, మహానంది ప్రాంతాలను పాలించాడు. క్రీ.పూ. 323లో మౌర్య చంద్రగుప్తుడు వీరిని ఓడించి సింహాసనాన్ని అధిష్టించాడు.తరువాత పాండవ వంశీయుడైన ఉత్తుంగ భోజుని కుమారుడైన నందన చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతడే నంద మహారాజు. వెలనాటి చోళులల్లో విక్రమభోజుడు క్రీ.శ. 1118 నుంచి 1135 వరకు మహేంద్రగిరి(గంజాం) శ్రీశైలం మధ్యగల పర్వత ప్రాంతాలన్నింటినీ పరిపాలించాడు. అతను కూడా ఈ క్షేత్రానికి వచ్చి పరమశివుడిని పూజించి ఆలయ గోపురాలు, కొన్ని కట్టడాలు, మండపాలు నిర్మించి క్షేత్రాభివృద్ధికి దోహదం చేశాడు. ఆ తర్వాత విజయనగర రాజులు సైతం కొన్ని కట్టడాలు, భక్తులకు వసతులు.. రహదారులు ఏర్పాటు చేసి శివుడిని ఆరాధించారు. ఈ క్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్ర సహా పలురాష్ట్రాల భక్తులు వస్తుంటారు. బ్రహ్మగుండం, రుద్రగుండం, విష్ణుగుండం ఉన్నాయి. ఇందులో రుద్రగుండంనుంచి రెండు ధారలు బయటికి ప్రవహిస్తుంటాయి. రుద్రగుండంలో పంచలింగాల మండపం: ఇందులో పృథ్వీ(భూ)లింగం, జలలింగం, తేజో(అగ్ని)లింగం, వాయు లింగం, ఆకాశ లింగం ప్రతిష్ఠించారు. విశేషంగా నిర్వహించే పండుగలు: మహాశివరాత్రి, ఉగాది, దసరా, సంక్రాంతి పండుగలకు ఇక్కడ ప్రత్యేకపూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.మహానందిలో దర్శనవేళలు ప్రతిరోజు వేకువజామున ఆలయశుద్ధి. 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు బిందెసేవ 5.30 గంటల నుంచి సుప్రభాతసేవ 6 గంటల నుంచి 6.30 గంటల వరకు అష్టవిధ మహామంగళహారతుల పూజలు (ఈ సమయంలోనే భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం) ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు అష్టవిధ మహామంగళహారతులు, నిజరూప దర్శనం ఉంటుంది. భక్తులకు ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దైవదర్శనం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో మాత్రం కేవలం 15 నిమిషాలు నివేదన సమయంలో దర్శనం ఆపు చేస్తారు. ప్రధాన పూజలు/ఆర్జిత సేవలు... - సర్వ దర్శనం(ఒకరికి) రూ. 100- - సాధారణ దర్శనం(ఒకరికి) రూ. 100- - మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం దంపతులకు రూ. 2,000- - రుద్రాభిషేకం రూ. 1,000- - స్వామివారి కల్యాణోత్సవం ఒక్కసారి దంపతులకు రూ. 1,000- ఉత్సవాలు......... మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రి ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. మహాప్రసాదాలు లడ్డూ , అభిషేకం లడ్డూ, పులిహోర ప్యాకెట్ కోనేరు...... రుద్రగుండం పుష్కరిణిలో ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మళ్లీ 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పుణ్యస్నానాలకు అనుమతి ఉంటుంది. వీటి మధ్యకాలంలో బయట ఉన్న రెండు చిన్న కోనేర్లలో నిరంతరం పుణ్యస్నానాలు చేయవచ్చు. ఎలా వెళ్లాలి...? మహానంది కర్నూలుకు 96 కిలోమీటర్లు మరియు నంద్యాలకు 14 కిలో మీటర్ల దూరంలో కలదు. కర్నూలు పట్టణానికి రైలు సౌకర్యం కలదు.