header

Navanandulu Temples, Kurnool / నవనందుల దేవాలయాలు

సుప్రసిద్ధ మహానంది పుణ్యక్షేత్రంతో పాటు మరో ఎనిమిది క్షేత్రాలను కలిపి నవనందులంటారు. ఒకేరోజు సూర్యాస్తమయం లోపల వీటిని దర్శించుకోవాలి. ఇవన్నీ కర్నూలు జిల్లాలో సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి.
ప్రథమ నంది : నవనందులలో మొదటిది. నంద్యాలకు నైరుతీ దిక్కున చామక్యా ఒడ్డున ఉంది. పూర్వం విధాత కోరిక మేరకు పరమశివుడు ఇక్కడ ప్రధమ నందీశ్వరునిగా వెలశాడు. కార్తీకమాసం నెలరోజు సూర్యాస్తమయ సమయంలో నందీశ్వరుడిపై సూర్యకిరణాలు పడటం విశేషం.
నాగనంది : రెండవది నాగనంది నంద్యాల ఆంజనేయస్వామి దేవాలయంలోని ఉంది. పూర్వ నాగులు గరుత్మంతుని ధాటికి తట్టుకోలేక పరమశివుని కోసం తపమాచరించిన ప్రదేశమిది. నాగుల తపస్సుకు మొచ్చి శివుడు వారికి అభయమిచ్చి కాపాడాడు.
సోమనంది : మూడవది సోమనంది నంద్యాల పట్లణానికి తూర్పున ఉన్న ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో ఉంది. పూర్వ సోముడు (చంద్రుడు శివుని కోసం తపస్సు చేసిన స్థలమిది.
శివనంది : నాల్లవ శివనంది మహానంది క్షేత్రానికి ఉత్తరాన 10 కి.మీ దూరంలో బండి ఆత్మకూరు మండలంలో కడమ కాల్వ గ్రామంలో ఉంది. ఈ ఆలయం మిగతా ఆలయాకంటే పెద్దది. అరణ్యప్రాంతంలో ఉండటం వలన ప్రశాంతంగా ఉంటుంది.
సూర్యనంది : ఐదవది సూర్యనంది మహానందికి 8 కి.మీ దూరంలోని తమ్మడపల్లి గ్రామంలో ఉంది. ఈశ్వరుడి కోసం సూర్యడు తపస్సు చేసిన ప్రదేశమిది. రోజూ సూర్యోదయ సమయంలో కిరణాలు ఈ లింగంపై పడటం విశేషం.
విష్ణు నంది : ఆరవ విష్ణునంది మహానందికి ఉత్తరాన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు మహాదేవుడికోసం శ్రీహరి ఇక్కడే తపస్సు చేశాడట. ఆలయంలో పాలరాతితో చేసిన నంది విగ్రహం కనువిందుగా ఉంటుంది. ఇక్కడకు వచ్చే నీరు కొన్ని వందల ఎకరా పంటపొలాల సాగుకు ఉపయోగపడుతుంది.
మహానంది : ఏడవది ముఖ్యమైనది మహానంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన నందన వంశరాజుకి శివుడు కలలో కనిపించి తాను మహానందితోపాటు మరో ఎనిమిది క్షేత్రాలో ఉన్నననీ అక్కడ ఆలయాలు కట్టించి అభివృద్ధి చేయాలని ఆజ్ఞాపించాడట. అప్పుడు రాజు ఈ ఆలయాన్నీ కట్టించాడు. మహానంది స్వయంభూలింగం. ఈ నందీశ్వరుడి ప్రస్తావన స్కంద, లింగ, శివమహాపురాణాల్లో కనిపిస్తుంది. క్షేత్ర ప్రాధాన్యంతో పాటు తీర్థ ప్రాధాన్యమూ ఉన్న ప్రదేశమిది. ఇక్కడి కోనేటిలో ఎప్పుడూ అయిదడుగల లోతులో నిలిచి ఉండే నీరు వేసవిలో చల్లగా శీతాకాంలో వెచ్చగా ఉంటాయి.
వినాయకనంది : ఎనిమిదవ వినాయక నంది మహానంది కోనేటి గట్టునే ఉంది. పూర్వ వినాయకుడు ఈ ప్రాంతంలో తపమాచరించాడంటారు.
గరుడనంది : తొమ్మిదవ గరుడనంది వినాయకనంది క్షేత్రంలోకి ప్రవేశిస్తుండగా కనిపిస్తుంది. గరుత్మంతుడు తన తల్లి అయిన వినతాదేవి దాస్య విముక్తి కోసం అమృత కలశాన్ని తెచ్చేందుకు బయలుదేరే ముందు విజయం కలగాని పరమేశ్వరునికోసం తపస్సు చేసి ప్రదేశమిది.
ఈ నవనందులను కార్తీకమాసంలో దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు వస్తారు.
నందీశ్వరుని గురించి : పరమశివభక్తుడు, శివుని వాహనమైన నందిశ్వరుని తండ్రి శిలాదుడనే మహర్షి. శిలాదుడు సంతానం కోసం శివునికోసం తపస్సు చేయగా శివుడు సంతుష్టుడై శిలాదునికి ఒక అల్పాయిష్కుడైన కుమారుడు దొరకుతాడు అని వరమిస్తాడు. శిలాదుడు ఓసారి యజ్ఞం జరిపించటానికి యజ్ఞగుండాన్ని తవ్వుచుండగా ఒక బాలుడు లభిస్తాడు. అప్పుడు ఆశరీరవాణి ఈ బాలుడు తల్లితండ్రుకే కాక శివపార్వతులకు కూడా ప్రియమౌతాడని నంది అని పేరు పెట్టమని చెబుతుంది.
కాలక్రమంలో నంది తన అల్పాయుష్షు గురించి తెలుసుకొని శివుని గురించి ఘోరతపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై నందికి ముల్లోలకాను జయించే శక్తిని ప్రసాదించి తన వాహనంగా ఉండమని కోరతాడు. మరియు నంది వంశంలోని అయిదు తరాల వారికి శివగణంలో చేరే అర్హతను ప్రసాదిస్తాడు. నంది ఆరాధన శుభప్రదం. సంతానం లేనివారు నంది ఆరాధాన చేస్తే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసం. ఇలాంటి నంది కొలువైన అపురూపమైన నవనందుల అలయాలు మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్నాయి.
ఎలా వెళ్లాలి ? ..కర్నూలుకు రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా వెళ్లవచ్చు.